Shehbaz Sharif : భారత్‌కు అధికారం లేదు.. సింధు జలాలపై షరీఫ్ వ్యాఖ్యలు
Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
- By Kavya Krishna Published Date - 01:46 PM, Wed - 2 July 25

Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది ఢిల్లీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ సందర్శన సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత డాన్ పత్రిక ప్రకారం, షరీఫ్ మాట్లాడుతూ “1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయలేదు” అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్య పాకిస్థాన్‌కు తలెత్తిన నీటి కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని అన్నారు. దేశీయంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
నీటి భద్రత కోసం ఆరేళ్లుగా నిలిచిపోయిన డైమర్-భాషా డ్యామ్ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని షరీఫ్ సూచించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైనా పర్యావరణ సమస్యలు, అధిక ఖర్చులు వంటి అంశాలతో జాప్యం జరిగింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్, మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమవగా, పాకిస్థాన్‌లోని కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్థాన్‌కు సరఫరా చేస్తున్న సింధు జలాలను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రస్థాయికి చేరింది. భారత చర్యపై పాకిస్థాన్ మల్లగుల్లాలు పడుతోంది.
Mini Battle Tank : వావ్.. మినీ యుద్ద ట్యాంక్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు