Sheikh Hasina: రూ. 30 వేల షాపింగ్ చేసిన మాజీ ప్రధాని హసీనా.. మరికొన్ని రోజులు భారత్‌ల్లోనే..!
షేక్ హసీనా హిండన్ ఎయిర్‌బేస్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి బట్టలు, కొన్ని వస్తువులను కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని తనతో పాటు కొన్ని సూట్‌కేస్‌లను మాత్రమే తీసుకొచ్చారని చెబుతున్నారు.
- By Gopichand Published Date - 11:00 AM, Thu - 8 August 24

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. అమెరికా, లండన్‌లలో ఆశ్రయం పొందాలనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. మరికొద్ది రోజులు ఆమె ఇండియాలోనే ఉండొచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. హసీనా తనకు అవసరమైన కొన్ని వస్తువులను హిండన్ ఎయిర్‌బేస్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి కొనుగోలు చేసింది. బట్టలు, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు రూ.30 వేలు ఖర్చు చేసిందని, కరెన్సీ నోట్ల కొరత కూడా ఉందని చెబుతున్నారు.
సోదరి బట్టల కోసం షాపింగ్
మూలాల ప్రకారం.. షేక్ హసీనా హిండన్ ఎయిర్‌బేస్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి బట్టలు, కొన్ని వస్తువులను కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని తనతో పాటు కొన్ని సూట్‌కేస్‌లను మాత్రమే తీసుకొచ్చారని చెబుతున్నారు. రూ. 30,000తో కొనుగోలు చేసి భారతీయ కరెన్సీ అయిపోవడంతో బంగ్లాదేశ్ కరెన్సీలో చెల్లించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తన సోదరికి బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read: Health Tips : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదా.. ఇంట్లో ఇవి ఉంచుకోండి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మరికొన్ని రోజులు భారత్‌లోనే ఉండొచ్చు
షేక్ హసీనా లండన్‌కు వెళ్లే అవకాశం ఉందని గతంలో సమాచారం ఉంది. అయితే ఆమెకు బ్రిటన్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అమెరికా వెళ్లాలనే ఆమె ఆశలు కూడా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ఆమె ఇంకొన్ని రోజులు ఇండియాలోనే ఉంటారని విశ్వసనీయ సమాచారం. దీని తర్వాత ఆమె భవిష్యత్తు కోసం ప్లాన్ చేయనున్నారు. కాగా, మాజీ ప్రధానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె కుమారుడు ఇప్పటికే స్పష్టం చేశారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో గురువారం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. షేక్ హసీనా కుటుంబానికి బద్ధ శత్రువు. బిఎన్‌పి నాయకురాలు ఖలీదా జియా కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.