HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Powerful 7 5 Magnitude Earthquake Strikes Japan

జపాన్‌లో భారీ భూకంపం!

భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ రైలు సేవలను కొంతకాలం పాటు ఆపివేశారు.

  • Author : Gopi Date : 20-04-2026 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Japan Earthquake
Japan Earthquake

Japan Earthquake: జపాన్‌లో సోమవారం సంభవించిన శక్తివంతమైన భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 7.5గా నమోదైంది. దేశంలోని ఈశాన్య తీరానికి సమీపంలో సముద్రంలో ఈ భూకంపం సంభవించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జపాన్ వాతావరణ సంస్థ సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో దీని ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది. ఈ ప్రకంపనల తర్వాత తీర ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

ప్రభుత్వం తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టి ప్రభావిత ప్రాంతాలైన ఇవాటే, అయోమోరి, హక్కైడోలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ప్రధాని సానాయే తకైచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రాంతాలకు లేదా సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే అనేక చోట్ల ప్రజలు కనీసం నిలబడలేకపోయారు. జపాన్ భూకంప తీవ్రతను కొలిచే వ్యవస్థలో దీనిని ‘అప్పర్ 5’ స్థాయి ప్రకంపనగా గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైన విభాగం కిందకు వస్తుంది.

Also Read: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

Old visuals of Earthquake in Japan https://t.co/oLWVwO9mjE pic.twitter.com/AiXQOvzHyW

— Saturn World News (@SaturnWorldNews) April 20, 2026

నిలిచిపోయిన బుల్లెట్ రైళ్లు

భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ రైలు సేవలను కొంతకాలం పాటు ఆపివేశారు. టీవీ ఛానెళ్లలో నిరంతరం అలర్ట్ మెసేజ్‌లు ప్రసారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సునామీ వల్ల నష్టం తగ్గించడానికి కొన్ని రేవుల్లో ఉన్న ఓడలను సముద్రం లోపలికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. కానీ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. సహాయక, రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తంగా ఉంచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7.5 Magnitude Earthquake
  • Coastal Evacuation
  • japan earthquake
  • Pacific Ring of Fire
  • Prime Minister Sanae Takaichi
  • Tsunami Alert Japan

Related News

    Latest News

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd