Terror Attack Video: ఉగ్రదాడి.. మరో వీడియో వెలుగులోకి!
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తుపాకీ బులెట్ల శబ్దం వినిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం రాగానే ప్రజలు భయంతో పరుగెత్తడం కనిపిస్తోంది.
- By Gopichand Published Date - 01:22 PM, Sat - 26 April 25

Terror Attack Video: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన మరో వీడియో (Terror Attack Video) వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తుపాకీ బులెట్ల శబ్దం వినిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం రాగానే ప్రజలు భయంతో పరుగెత్తడం కనిపిస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు 26 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియోలో ఉగ్రవాదులు ప్రజలపై కాల్పులు జరిపిన తీరు కనిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం వినగానే ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటు అటు పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన సమయంలో అక్కడ సెలవుల కోసం వచ్చిన చాలా మంది ఉన్నారు. ఉగ్రవాదులు వ్యక్తుల పేర్లు అడిగి లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఉగ్రవాదులు కేవలం పురుషులపైనే దాడి చేసి, వారిని తుపాకీ బుల్లెట్లతో కాల్చి చంపారు.
#WATCH | पहलगाम आतंकी हमले का सबसे नया वीडियो आया सामने, वीडियो में फायरिंग करते दिख रहे हैं आतंकी, देखें.#Pahalgam #PahalgamAttack #JammuKashmir #Kashmir #ABPNews pic.twitter.com/kMQlaS1w9d
— ABP News (@ABPNews) April 26, 2025
తన తండ్రిని కోల్పోయిన కొడుకు ఇలా చెప్పాడు
పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో తన తండ్రిని కోల్పోయిన 20 ఏళ్ల హర్షల్ లేలే.. న్యూస్ ఏజెన్సీ పీటీఐతో మాట్లాడుతూ దాడి సమయంలో తన తండ్రి లాగా ఆలోచించానని, తన తల్లిని సురక్షిత స్థానానికి తీసుకెళ్లాలనే ఆలోచన మొదట వచ్చిందని చెప్పాడు. హర్షల్ చెప్పిన ప్రకారం.. వారు మధ్యాహ్న భోజనం పూర్తి చేసిన కొద్ది సేపటికే బుల్లెట్ల శబ్దం వినిపించింది. దాడి సమయంలో హర్షల్‌కు తుపాకీ బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. మరొక బుల్లెట్ అతని పక్కనుండి దాటి అతని తండ్రికి తగిలింది.
Also Read: Rozgar Mela : త్వరలోనే 51 వేల పోస్టుల భర్తీ : బండి సంజయ్
“నా తల్లిని కాపాడడం నా బాధ్యత. నేను నా తండ్రి స్థానంలో నన్ను ఊహించుకుని ఆలోచించాను. అతని మనసులో మొదటి ఆలోచన తల్లిని కాపాడడం అయి ఉంటుంది.కాబట్టి నేను అదే చేశాను.” అని పేర్కొన్నాడు. అతను మరింత మాట్లాడుతూ.. “నా తల్లికి పాక్షిక పక్షవాతం ఉంది. కాబట్టి ఆమెకు నడవడం కష్టం. నేను, నా బంధువైన ధ్రువ్ జోషి ఆమెను ఎత్తుకుని గరుకైన రాళ్ల మార్గంలో పరుగెత్తాము. ఆమె చాలా చోట్ల జారి గాయపడింది. కానీ మాకు వేరే ఎంపిక లేదు.” అని అతను కన్నీటిపర్యంతమయ్యాడు.