World
-
Covid Update: చైనాలో ఆంక్షలు సడలాయి.. ‘గ్రేట్ మైగ్రేషన్’ మొదలైంది..ఇక కరోనా కూడా సాధారణ వ్యాధే!!
కొత్త సంవత్సరం వేళ చైనాలో ‘గ్రేట్ మైగ్రేషన్’ జరుగుతోంది. కొవిడ్ ఆంక్షలు సడలించడంతో రానున్న 40 రోజుల పాటు చైనీయులు భారీగా ప్రయాణాలు చేయనున్నారు.
Date : 08-01-2023 - 8:15 IST -
British Airways: కొత్త డ్రెస్ కోడ్ రిలీజ్ చేసిన బ్రిటిష్ ఎయిర్వేస్..!
బ్రిటిష్ ఎయిర్వేస్ (British Airways) తన యూనిఫాంలో పెద్ద మార్పు చేసింది. ఎయిర్వేస్ యూనిఫాంలో జంప్‌సూట్, హిజాబ్‌ను చేర్చింది. ఎయిర్వేస్ 20 ఏళ్ల తర్వాత యూనిఫాం మార్చింది. మహిళా క్యాబిన్ సిబ్బంది జంప్‌సూట్‌ను ధరించాల్సి ఉంటుంది.
Date : 08-01-2023 - 11:55 IST -
Road Traffic Accident: చైనాలో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం
తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం హృదయ విదారక ప్రమాదం జరిగింది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (Road Traffic Accident)లో సుమారు 17 మంది మరణించగా, 22 మంది గాయపడినట్లు సమాచారం.
Date : 08-01-2023 - 8:49 IST -
US House Speaker: అమెరికా దిగువ సభ స్పీకర్ గా కెవిన్ మెక్‌కార్తీ
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లోని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ)కు స్పీకర్ గా రిపబ్లికన్ నేత కెవిన్ మెక్‌కార్తీ (Kevin McCarthy) ఎన్నికయ్యారు. 4 రోజులుగా జరుగుతున్న ఓటింగ్ లో 15వ రౌండ్ తర్వాత మెక్‌కార్తీ విజయం సాధించారు.
Date : 07-01-2023 - 2:11 IST -
29 Killed: డ్రగ్ లార్డ్ కొడుకును పట్టుకునేందుకు 29 మంది మృతి
మెక్సికోలో డ్రగ్ కింగ్‌పిన్ ఎల్ చాపో గుజ్మాన్ కుమారుడిని అరెస్టు చేయడానికి శుక్రవారం చేపట్టిన ఆపరేషన్‌లో మొత్తం 29 మంది మరణించినట్లు (29 Killed) మెక్సికన్ ప్రభుత్వం తెలియజేసింది. మెక్సికోలోని భద్రతా దళాలు జైలులో ఉన్న డ్రగ్ లార్డ్ "ఎల్ చాపో" గుజ్మాన్ కుమారుడు గుజ్మాన్ లోపెజ్‌ను పట్టుకున్నారు. డ్రగ్ కార్టెల్ ఎల్ చాపో, జాతీయ సైన్యం మధ్య మెక్సికో వీధుల్లో ఘర్షణలు జరిగాయి.
Date : 07-01-2023 - 10:30 IST -
Boy Shoots Teacher: టీచర్ పై ఆరేళ్ల కుర్రాడి కాల్పుల కలకలం
అమెరికా (America)లోని వర్జీనియాలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో టీచర్ పై చిన్నారి కాల్పులు (Boy Shoots Teacher) జరిపాడు. అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. వర్జీనియాలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్ లో తాజాగా విస్తుపోయే ఘటన జరిగింది.
Date : 07-01-2023 - 9:26 IST -
US Man Kills Family: అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులని కాల్చి చంపిన భర్త
అమెరికాలో దారుణం జరిగింది. భార్య విడాకులకు దరఖాస్తు చేసిందనే కోపంతో భర్త మృగంలా మారాడు. భార్యతో సహా ఏడుగురు కుటుంబసభ్యులను కాల్చి (US Man Kills Family) చంపాడు. ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురితో కూడిన తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడో వ్యక్తి.
Date : 07-01-2023 - 7:27 IST -
Donald Trump Gets One Vote: అమెరికా దిగువ సభ స్పీకర్ ఎన్నికలో అనూహ్య ఘటన.. ట్రంప్ కి ఒకే ఒక ఓటు
అమెరికా దిగువ సభ స్పీకర్ ఎన్నికలో అనూహ్య ఘటన జరిగింది. స్పీకర్ పదవికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును రిపబ్లికన్ పార్టీ నేత మాట్ గేట్జ్ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా.. ట్రంప్ పేరుకు అనుకూలంగా ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా నామినేట్ చేసిన రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ వేసిందే.
Date : 07-01-2023 - 6:54 IST -
Heart Attack: 40వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హార్ట్ ఎటాక్.. అయినా!?
అదృష్టం బాగుంటే ఏం చేసినా అంతా మంచి జరుగుతుందని అంటారు. అదృష్టం మన వెంట ఉన్నప్పుడు మనకు ఎలాంటి అపాయం కలిగినా పెద్దగా ప్రభావం పడదు అని అందరూ నమ్మే సత్యం.
Date : 06-01-2023 - 8:43 IST -
Father: అమ్మ అయిన తండ్రి.. కూతుళ్ళ కోసం ఏకంగా అలా!
పిల్లల ఆనందం కోసం తల్లితండ్రులు ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఈక్విడార్‌లో జరిగింది. కన్నకూతళ్ల కోసం ఏకంగా లింగానే మార్చుకున్నాడు ఓ తండ్రి.
Date : 06-01-2023 - 8:09 IST -
11 Terrorists Killed: 11 మంది ఉగ్రవాదులు హతం
దేశంలో ఉగ్రవాదాన్ని నివారించేందుకు పాకిస్థాన్ భద్రతా బలగాలు స్పెషల్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా తాజాగా బలగాలు 11 మంది ఉగ్రవాదులను (11 Terrorists Killed) హతమార్చాయి. వారిలో ఇద్దరు సూసైడ్ బాంబర్స్ కూడా ఉన్నట్లు ISPR పేర్కొంది.
Date : 06-01-2023 - 1:35 IST -
President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో మరణిస్తారు: ఉక్రెయిన్ స్పై చీఫ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ (Ukrainian) మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కైరిలో బుడనోవ్ రష్యా అధ్యక్షుడు మరణం 'క్యాన్సర్‌తో కొనసాగుతున్న అనారోగ్యం కారణంగా ఆసన్నమైందని' తనకు తెలుసునని నొక్కి చెప్పారు.
Date : 06-01-2023 - 11:16 IST -
Corona: షాకింగ్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 కరోనా వేరియంట్లు గుర్తింపు!
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది.
Date : 05-01-2023 - 10:32 IST -
Amazon: 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు.. షాకిచ్చిన అమెజాన్?
ఆన్ లైన్ రిటైలర్ అయిన అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
Date : 05-01-2023 - 8:49 IST -
Amazon Jobs: ఆర్థిక సంక్షోంభం.. అమెజాన్ లో 18 వేల ఉద్యోగాలు కట్!
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 05-01-2023 - 11:13 IST -
Doctor: 60వ బిడ్డకు తండ్రైన డాక్టర్.. నాలుగో భార్య కోసం ఎదురుచూపు!
చాలా మంది భర్తలు తమ భార్యలతో వేగలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి తనకు ముగ్గురు భార్యలున్నా నాలుగో భార్య కోసం చూస్తున్నాడు.
Date : 04-01-2023 - 9:41 IST -
Urinates On Female Passenger: ఇదేం పని.. విమానంలో మహిళపై మూత్రం పోసిన ప్యాసింజర్
ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో దారుణంగా ప్రవర్తించాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ (Female Passenger) పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.
Date : 04-01-2023 - 11:10 IST -
US Airport Worker Die: విమానం ఇంజిన్ గుంజేయడంతో ఎయిర్పోర్ట్ ఉద్యోగి మృతి
అమెరికాలోని అలబామాలో ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ పోర్ట్ ఉద్యోగి మృతి(US Airport Worker Die) చెందాడు. డిసెంబరు 31న అలబామాలోని మోంట్‌గోమెరీ ప్రాంతీయ విమానాశ్రయంలో ఒక విమానాశ్రయ కార్మికుడు విమానం ఇంజిన్‌లో చిక్కుకుని మరణించాడు.
Date : 04-01-2023 - 8:15 IST -
Mexico Supreme Court: మెక్సికో తొలి మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నార్మా లుసియా
మెక్సీకో (Mexico)లో తొలిసారిగా ఓ మహిళ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ నార్మా లుసియా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో ఆమె విజయం సాధించారు.
Date : 04-01-2023 - 6:45 IST -
Brazil President: బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా
బ్రెజిల్ నూతన అధ్యక్షుడి (Brazil President)గా మూడోసారి లులా డ సిల్లా (76) ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా విజయం సాధించారు. తమ అభిమాన నాయకుడి ప్రమాణాన్ని వీక్షించేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు తరలివచ్చారు.
Date : 03-01-2023 - 9:00 IST