Turkey and Syria: టర్కీ, సిరియాలో 15 వేలు దాటిన మరణాలు
టర్కీ, సిరియాలో భూకంప (Earthquake) మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది.
- Author : Maheswara Rao Nadella
Date : 09-02-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
టర్కీ (Turkey), సిరియా (Syria) లో భూకంప మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. ఇరు దేశాల్లో సంభవించిన ఘోర భూకంపాల వల్ల ఇప్పటికే 15 వేల మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా టర్కీ (Turkey) లో 12,391 మంది, సిరియా (Syria) లో 2992 మంది మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశారు. శిథిలాల చిక్కుకున్న వారిలో దాదాపు 60 వేల పైచిలుకు మందిని సహాయ బృందాలు రక్షించాయి.
అయితే, సహాయ చర్యల్లో కీలకమైన 72 గంటల సమయం గడిచిపోయింది. దాంతో, ఇప్పటిదాకా శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో దక్కే అవకాశం లేదు. దాంతో,ఇకపై మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శిథిలాలతో పాటు గట్టగట్టిన మంచు కింద చిక్కుకొని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read: Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.900