World
-
Pervez Musharraf Dead: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. ముషారఫ్ (Pervez Musharraf) చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 79 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
Date : 05-02-2023 - 12:01 IST -
Wikipedia in Pakistan: వికీపీడియా సర్వీసులు పాకిస్థాన్ లో బ్లాక్!
వికీపీడియా సర్వీసులను పాకిస్తాన్ (Pakistan) బ్లాక్ చేసింది. దైవ దూషణకు సంబంధించిన
Date : 05-02-2023 - 11:00 IST -
China Balloon: చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చిన అమెరికా
దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్‌ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్‌ను సూపర్‌సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
Date : 05-02-2023 - 8:45 IST -
Chinese Billionaires: సింగపూర్ కు ఎగిరిపోతున్న చైనా బిలియనీర్లు.. కారణమిదే..?
చైనాకు చెందిన పలువురు బిలియనీర్లు (Chinese Billionaires) ఇటీవలి కాలంలో సింగపూర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ భయంతో అక్కడి బిలియనీర్లు చైనాను వదిలి సురక్షిత దేశానికి తరలివెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పన్ను చెల్లించని చాలా మంది బిలియనీర్లు, సెలబ్రిటీలపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నా విషయం తెలిసిందే.
Date : 05-02-2023 - 8:18 IST -
Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..
బ్లింకెన్ చైనా (China) పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే.
Date : 04-02-2023 - 12:51 IST -
Ilhan Omar: భారత వ్యతిరేక ఎంపీ ఇల్హాన్ ఒమర్‌కు షాక్.. కీలక కమిటీ నుంచి ఔట్
అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌కు (Ilhan Omar) రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తిమంతమైన హౌస్ ‘ఫారెన్ అఫైర్స్ కమిటీ’ నుంచి తొలగించారు. ఆమె 2019లో ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల చూస్తే కమిటీలో ఉండటానికి అర్హురాలు కాదని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వాదించారు.
Date : 04-02-2023 - 10:45 IST -
13 Killed: అటవీ ప్రాంతంలో మంటలు.. 13 మంది మృతి
వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీలోని (South Central Chile) అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలకు స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే శాంటా జువానా పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 13 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు.
Date : 04-02-2023 - 10:11 IST -
Same Sex Marriage: ఇద్దరు అబ్బాయిల లవ్ స్టోరీ.. వివాహానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్..!
వివాహానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్వలింగ జంట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా (Utkarsh Saxena, Ananya Kotia) అనే ఇద్దరు యువకులు గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి అనుమతించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. విదేశాల్లో చదువుకుంటున్న వీరిద్దరూ కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
Date : 04-02-2023 - 9:20 IST -
Bill Gates: చెఫ్ అవతారమెత్తిన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) ఇప్పుడు చెఫ్ అవతారమెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బర్నాథ్ తో కలిసి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ బిల్ గేట్స్‌తో కలిసి రోటీ తయారు చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Date : 04-02-2023 - 7:09 IST -
Regenerate Diseased Kidney Cells: సంచలన ప్రయోగం.. దెబ్బతిన్న కిడ్నీ కణాలు మళ్లీ యాక్టివేట్
పూర్తిగా దెబ్బతిన్న కిడ్నీ కణాలను రిపేర్ చేసి, మళ్లీ యాక్టివేట్ చేయొచ్చా? అంటే "చేయొచ్చు" అని శాస్త్రవేత్తలు తొలిసారిగా నిరూపించారు. దీంతో కిడ్నీ వైద్య రంగంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్ల యింది. సింగపూర్ లోని డ్యూక్ ఎన్ యూఎస్ మెడికల్ స్కూల్, నేషనల్ హర్ట్ సెంటర్ సింగపూర్, జర్మనీకి చెందిన సైంటిస్టుల టీమ్ చేసిన రీసెర్చ్ లో ఈ రిజల్ట్ వచ్చింది.
Date : 04-02-2023 - 6:34 IST -
Eye Drops: అప్పుడు దగ్గు మందు.. ఇప్పుడు కంటి చుక్కల మందు.. ప్రాణాలకు ముప్పు!
మనకు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు వేసుకుంటే మనకు అంతా నయమవుతుంది.
Date : 03-02-2023 - 10:18 IST -
Electric Plane: ఎలక్ట్రిక్ విమానం కూడా వచ్చేస్తోంది..!
ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ తగ్గి ఇప్పుడు ఎలక్ట్రిక్ హవా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ బైక్స్, కార్స్ కు మాత్రమే కాదు. విమానాలకు కూడా అప్లై చేస్తోంది నాసా. ఈక్రమంలో ఈ ఏడాదే నాసా విద్యుత్ విమానం (Electric Plane) వచ్చేస్తోంది. దీనికి " ఎక్స్–57" అని పేరు పెట్టారు.
Date : 03-02-2023 - 7:38 IST -
Children Dragged By Train: ఘోరం.. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి 100 మీటర్లు లాక్కెళ్లిన రైలు
జర్మనీ (Germany)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు ఢీకొనడంతో ఓ చిన్నారి మరణించింది. మరో చిన్నారికి కూడా గాయాలు అయ్యాయి. జర్మనీలోని రెక్లింగ్‌హౌసెన్ పట్టణంలో గురువారం ఇద్దరు చిన్నారులు రైలు ఢీకొనడమే కాకుండా చాలా దూరం ఈడ్చుకెళ్ళింది.
Date : 03-02-2023 - 12:30 IST -
Ugandan Villager: ఓరి నాయనో.. ఆయనకి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు..!
ప్రపంచంలోని అనేక అద్భుతమైన విన్యాసాల గురించి మీరు తెలుసుకుంటారు. అలాంటి వార్త ఒకటి ఆఫ్రికా నుంచి వచ్చింది. ఉగాండా (Uganda)లో ఓ వ్యక్తి పెళ్లిళ్లు, అతని పిల్లలు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కి చర్చనీయాంశంగా మారారు. నిజానికి ఉగాండాకు చెందిన ఓ రైతు 12 పెళ్లిళ్లు చేసుకోగా మొత్తం 102 మంది పిల్లలు ఉన్నారు.
Date : 03-02-2023 - 10:24 IST -
Pakistan Crisis: మొన్న గోధుమపిండి.. రేపు నూనెలు.. పాక్‌లో దయనీయ స్థితి!
మన దాయాది దేశం పాకిస్థాన్ లో విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పటికే తినడానికి తిండి లేని పరిస్థితులు ఉండగా..
Date : 02-02-2023 - 9:26 IST -
World Richest Dog: వామ్మో.. ఈ కుక్క ఆస్తి రూ. 655 కోట్లు..!
మనుషులు కోటీశ్వరులు కావడం గురించి మీరు చాలా చూసి ఉంటారు. విన్నారు, చదివి ఉంటారు. కానీ కుక్క కోటీశ్వరుడని మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం భారతదేశంలో ఇలాంటివి మీరు చూసి ఉండరు, విని ఉండరు. ఇలా ఉంటుందని మీరు కూడా నమ్మకపోవచ్చు.
Date : 02-02-2023 - 1:49 IST -
Radioactive Capsule: మిస్సైన రేడియో ధార్మిక క్యాప్సూల్ ఆచూకీ లభ్యం!
ఆస్ట్రేలియాలో (Australia) కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్ దొరికింది.
Date : 02-02-2023 - 12:50 IST -
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హేలీ
ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ (Nikki Haley) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నాయకురాలు, ఫిబ్రవరిలో రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమె ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి 2024లో ఎన్నికలు జరగనున్నాయి
Date : 02-02-2023 - 12:39 IST -
Pakistan Former Minister: పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అరెస్ట్
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Former Minister), అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్) అధినేత షేక్ రషీద్‌ను గురువారం (ఫిబ్రవరి 2) అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. అతన్ని రావల్పిండిలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు.
Date : 02-02-2023 - 11:46 IST -
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో సోదాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) నివాసంలో సోదాలు చేసేందుకు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ చేరుకుంది. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని అధ్యక్షుడు జో బిడెన్ నివాసంలో బుధవారం FBI సోదాలు చేసింది. అప్పుడు బైడెన్ లేరని చెబుతున్నారు. ఆయన నివాసంలో సోదాలు జరిగినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది వెల్లడించారు.
Date : 02-02-2023 - 8:55 IST