World
-
World Richest Dog: వామ్మో.. ఈ కుక్క ఆస్తి రూ. 655 కోట్లు..!
మనుషులు కోటీశ్వరులు కావడం గురించి మీరు చాలా చూసి ఉంటారు. విన్నారు, చదివి ఉంటారు. కానీ కుక్క కోటీశ్వరుడని మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం భారతదేశంలో ఇలాంటివి మీరు చూసి ఉండరు, విని ఉండరు. ఇలా ఉంటుందని మీరు కూడా నమ్మకపోవచ్చు.
Date : 02-02-2023 - 1:49 IST -
Radioactive Capsule: మిస్సైన రేడియో ధార్మిక క్యాప్సూల్ ఆచూకీ లభ్యం!
ఆస్ట్రేలియాలో (Australia) కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్ దొరికింది.
Date : 02-02-2023 - 12:50 IST -
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హేలీ
ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ (Nikki Haley) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నాయకురాలు, ఫిబ్రవరిలో రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమె ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి 2024లో ఎన్నికలు జరగనున్నాయి
Date : 02-02-2023 - 12:39 IST -
Pakistan Former Minister: పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అరెస్ట్
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Former Minister), అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్) అధినేత షేక్ రషీద్‌ను గురువారం (ఫిబ్రవరి 2) అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. అతన్ని రావల్పిండిలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు.
Date : 02-02-2023 - 11:46 IST -
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో సోదాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) నివాసంలో సోదాలు చేసేందుకు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ చేరుకుంది. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని అధ్యక్షుడు జో బిడెన్ నివాసంలో బుధవారం FBI సోదాలు చేసింది. అప్పుడు బైడెన్ లేరని చెబుతున్నారు. ఆయన నివాసంలో సోదాలు జరిగినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది వెల్లడించారు.
Date : 02-02-2023 - 8:55 IST -
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. న్యూ బటాన్ ప్రాంతం నుంచి 14 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఫిలిప్పీన్ భూ విజ్దాన కేంద్రం తెలిపింది. భూ కంపం ధాటికి పలు దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి.
Date : 02-02-2023 - 6:25 IST -
YouTuber: వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్ దాతృత్వం.. సొంత ఖర్చుతో 1000 మందికి కంటి సర్జరీలు
ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ (YouTuber) మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతను 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. వాళ్ళ కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం హెల్ప్ చేశాడు.
Date : 01-02-2023 - 1:53 IST -
US Modi : అమెరికా పర్యటనకు మోడీ, ఆహ్వానించిన యూస్ అధ్యక్షుడు బిడెన్
ట్రంప్ మళ్లీ అధ్యక్ష రేస్ మొదలు పెట్టిన వేళ నరేంద్ర మోడీకి (US Modi)
Date : 01-02-2023 - 1:44 IST -
Thailand: థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాలంటైన్స్ డేకి ఫ్రీగా కండోమ్స్
ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థాయిలాండ్ (Thailand) ప్రభుత్వం సేఫ్ సెక్స్ ను ప్రమోట్ చేసేందుకు 95 మిలియన్ కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేయనుంది. సెక్సువల్లి ట్రాన్స్మిట్టెడ్ డిసీజెస్, టీన్ ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
Date : 01-02-2023 - 9:55 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. 33 స్థానాల్లో పోటీ.!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనుండగా, అన్ని చోట్లా ఆయనే పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన పీటీఐ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
Date : 31-01-2023 - 12:11 IST -
Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం
కెనడా (Canada)లో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈసారి బ్రాంప్టన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయంపై హిందూ వ్యతిరేక నినాదాలు రాయబడ్డాయి. ఇది భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసింది.
Date : 31-01-2023 - 8:49 IST -
Shooting At Nightclub: మెక్సికోలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
ఉత్తర అమెరికాలో ఉత్తర మెక్సికో (Northern Mexico)లోని జెరెజ్ నగరంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. నైట్‌క్లబ్‌లో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ సెక్రటేరియట్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం.. జకాటెకాస్ రాష్ట్రంలో సాయుధ దుండగులు పురుషులు రెండు వాహనాల్లో నైట్‌క్లబ్‌కు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది.
Date : 31-01-2023 - 7:39 IST -
Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!
ఈ మధ్య ఫ్లైట్ ప్రమాదాలు, విమాన సాంకేతిక లోపాలు జరగడం వంటి సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి.
Date : 30-01-2023 - 10:33 IST -
పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్.. 32 మంది మృతి, 150మంది గాయాలు!
సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్దనలు జరుగుతుండగా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు
Date : 30-01-2023 - 7:09 IST -
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ.35 పెంచుతూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఇండియా మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే మన దాయాది దేశం పాకిస్థాన్ లో దారున పరిస్థితి నెలకొంది.
Date : 29-01-2023 - 8:48 IST -
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
పాకిస్థాన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో.. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది.
Date : 29-01-2023 - 2:41 IST -
H-1B visa: హెచ్-1బీ వీసాలకు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్..!
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి శుభవార్త. ఇప్పుడు మీరు US వీసా కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నోటీసు ప్రకారం.. 2024 H-1B క్యాప్ కోసం రిజిస్ట్రేషన్ మార్చి 1 నుండి 17 వరకు తెరిచి ఉంటుంది.
Date : 29-01-2023 - 1:43 IST -
Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?
భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజా జె చారి (Raja Chari)ని వైమానిక దళం బ్రిగేడియర్ జనరల్ పదవికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసినట్లు US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల తెలిపింది. అన్ని సీనియర్ పౌర, సైనిక నియామకాలను ఆమోదించే సెనేట్ ద్వారా నియామకాన్ని ఖరారు చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
Date : 29-01-2023 - 10:21 IST -
Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు ఆ దేశ మహిళలపై విపరీతమైన ఆంక్షలు (Taliban bans) విధిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు, పని ప్రదేశాల్లో మహిళలను నిషేధించిన తాలిబన్లు, తాజాగా మహిళలపై మరో నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.
Date : 29-01-2023 - 9:40 IST -
24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ (Peru)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వాయువ్య పెరూలో ఒక బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 24 మంది (24 Dead) మరణించారు. కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని చెబుతున్నారు.
Date : 29-01-2023 - 8:17 IST