17 Died: జకార్తాలో పేలుడు.. 17 మంది దుర్మరణం, 51 మంది గాయాలు!
ఆయిల్ స్టేషన్ లో పేలుడు కారణంగా 17 మంది దుర్మరణం కాగా, 51 మంది గాయపడ్డారు.
- By Balu J Published Date - 02:58 PM, Sat - 4 March 23

ఇండోనేషియా కంట్రీలో నిల్వ చేసిన ఆయిల్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. దీంతో 17 మంది దుర్మరణం కాగా, 51 మంది గాయపడ్డారు. జకార్తాలోని ఇంధన నిల్వ స్టేషన్‌లోభారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. గాయపడిన వారు ఇండోనేషియా రాజధానిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జకార్తా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ (బిపిబిడి) తాత్కాలిక అధిపతి ముహమ్మద్ రిద్వాన్ మీడియాకు తెలిపారు. ఉత్తర జకార్తాలోని ప్లంపాంగ్‌లోని ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెర్టామినాకు చెందిన ఇంధన నిల్వ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో స్టేషన్‌కు సమీపంలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 50 ఫైర్ ఇంజన్లు, 260 అగ్నిమాపక సిబ్బంది మంటలు చెలరేగిన ప్రదేశానికి చేరుకొని సుమారు ఆరు గంటల్లో మంటలను ఆర్పగలిగారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లను కూడా సంఘటనా స్థలానికి పంపించారు. పేలుడు కారణంగా 1,000 మందికి పైగా నివాసితులు తీవ్ర ప్రభావమయ్యారు.

Related News

Massive Fire Accident: కింగ్ కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం
హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం.