Australian Police: కాల్పులు జరిపి భారతీయుడిని చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
ఆస్ట్రేలియా పోలీసులు (Australian Police) ఓ భారతీయుడిని కాల్చి చంపేశారు. మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32) సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు అక్కడి కానిస్టేబుళ్లతో గొడవపడ్డాడు.
- Author : Gopichand
Date : 01-03-2023 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఆస్ట్రేలియా పోలీసులు (Australian Police) ఓ భారతీయుడిని కాల్చి చంపేశారు. మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32) సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు అక్కడి కానిస్టేబుళ్లతో గొడవపడ్డాడు. దీంతో మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో రహమతుల్లా మరణించాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, దాడికి గురైన క్లీనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ పౌరుడిని అక్కడి పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటన సిడ్నీలోని ఓ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. భారతీయ జాతీయుడు స్వీపర్‌ను కత్తితో పొడిచి, చట్ట అమలు అధికారులను బెదిరించిన తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అదే సమయంలో భారత కాన్సులేట్ జనరల్ ఈ విషయంలో ఆస్ట్రేలియా నుండి పూర్తి నివేదికను కోరింది. మృతి చెందిన భారతీయుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32)గా గుర్తించారు. సిడ్నీలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అతనిని గుర్తించారు.
Also Read: Adenovirus: కోల్‌కతాలో ఐదుగురు చిన్నారులు మృతి.. అడెనోవైరస్ కారణమా..?
మంగళవారం సిడ్నీలోని ఆబర్న్ రైలు స్టేషన్‌లో 28 ఏళ్ల క్లీనర్‌పై అహ్మద్ దాడి చేసినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. అదే సమయంలో ఒక పోలీసు అధికారి మూడు కాల్పులు జరిపాడు. వాటిలో రెండు అహ్మద్ ఛాతీకి తగిలాయి. ఈ సమయంలో ఒక ప్రొబేషనరీ కానిస్టేబుల్ అతనిపై తన టేజర్‌ను కూడా ప్రయోగించాడు.
అయితే వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి, స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. నివేదికల ప్రకారం మరణించిన భారతీయ జాతీయుడు బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు.న్యూ సౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టువర్ట్ స్మిత్ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు స్పందించడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉందని చెప్పారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అహ్మద్‌ను కాల్చిచంపడం తప్ప అతనికి వేరే మార్గం లేకుండా పోయింది. ఇది బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు యాంటీ టెర్రరిజం యూనిట్ సహాయం కూడా తీసుకోనున్నారని ఆయన తెలిపారు.