Atom Bomb : ఆటం బాంబుతో ఇజ్రాయెల్‌కు జవాబివ్వండి.. ఇరాన్ అతివాదులు
ఇరాన్ వద్దనున్న హార్ముజ్(Atom Bomb) జలసంధిని బ్లాక్ చేయాలి.
- By Pasha Published Date - 03:00 PM, Mon - 30 September 24

Atom Bomb : ఓ వైపు లెబనాన్‌పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ తరుణంలో ఇరాన్ ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్‌లోని అతివాదుల వాదనను ప్రస్తుతానికి అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. తొందరపాటుతో ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తే ఇరాన్ పురోగతి ఆగిపోతుందని అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది. ఇజ్రాయెల్ మొండిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో దానికి ఆటం బాంబు వార్నింగ్ ఇవ్వడం బెటర్ అని పలువురు ఇరాన్ అతివాదులు అంటున్నారు. ఈమేరకు వారి ప్రభుత్వానికి డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ డిమాండ్లను చేస్తున్న వారిలో ఇరాన్ అతివాది సయీద్ జలీలీ కూడా ఉన్నారు. ‘‘ఇరాన్ వద్దనున్న హార్ముజ్(Atom Bomb) జలసంధిని బ్లాక్ చేయాలి. అణ్వాయుధాలను తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి’’ అని ఆయన ఇరాన్ సర్కారుకు సూచించారు.
Also Read :Russia Vs Ukraine : 6.51 లక్షల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్ ఆర్మీ
హసన్ నస్రల్లా మరణం నేపథ్యంలో ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందన సరిగ్గా లేదనే వాదన ఇరాన్ అతివాదుల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఇబ్రహీం రయీసీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇరాన్ స్పందన మరోలా ఉండేదని అంటున్నారు. ఇబ్రహీం రయీసీ హత్య వెనుక కచ్చితంగా ఇజ్రాయెల్ ఉండొచ్చనే అనుమానాలను వారు వ్యక్తపరుస్తున్నాయి. పేజర్లు, వాకీటాకీలను లెబనాన్‌లో పేల్చిన విధంగా.. ఇబ్రహీం రయీసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను కూడా ఇజ్రాయెల్ పేల్చి ఉంటుందని అంటున్నారు. ఇరాన్ మితవాదుల వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇరాన్ తొందరపాటుతో వ్యవహరించకూడదని, కేవలం జాతీయ ప్రయోజనాల కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో నిర్ణయాాలు తీసుకుంటే ఇరాన్ ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పనితీరు బాగుందని మితవాదులు పేర్కొంటున్నారు.