Netherlands: నెదర్లాండ్స్‌లో కొత్త చట్టం.. వాటి పెంపకంపై నిషేధం..!
నెదర్లాండ్స్ (Netherlands) ప్రభుత్వం త్వరలో 'డిజైనర్ యానిమల్స్'ను కాపాడేందుకు బిల్లును తీసుకురానుంది.
- Author : Gopichand
Date : 27-06-2023 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
Netherlands: నెదర్లాండ్స్ (Netherlands) ప్రభుత్వం త్వరలో ‘డిజైనర్ యానిమల్స్’ను కాపాడేందుకు బిల్లును తీసుకురానుంది. దీని కింద చదునైన ముఖాలు ఉన్న కుక్కలను లేదా చెవులు ముడుచుకున్న పిల్లులను పెంచుకోవడంపై నిషేధం ఉంటుంది. వాస్తవానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతోంది. ఎందుకంటే ఈ పెంపుడు జంతువులను డిజైనర్‌లుగా మార్చడానికి వాటితో ఓవర్‌బ్రీడింగ్ చేస్తున్నారు. అందుకే చదునైన ముఖం గల కుక్కలు లేదా చెవులు ముడుచుకున్న పిల్లులు వంటి అనారోగ్య డిజైనర్ జంతువులను ఉంచడం నెదర్లాండ్స్‌లో త్వరలో నిషేధించబడవచ్చు.
Also Read: West Indies: వన్డే వరల్డ్ కప్ కు వెస్టిండీస్ కష్టమే.. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
డిజైనర్ జంతువుల పెంపకం 2014లో నిషేధించబడింది
నెదర్లాండ్స్ సంస్కృతి మంత్రి మాట్లాడుతూ.. అమాయక జంతువులు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని మనం భావించడం వల్ల వాటి జీవితాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కారణంగా నెదర్లాండ్స్‌లో పెద్ద అడుగు వేస్తోందని, ఇది ఏ పెంపుడు జంతువుకు హాని కలిగించదని ఆయన అన్నారు. 2014లో నెదర్లాండ్స్‌లో డిజైనర్ పెంపుడు జంతువుల పెంపకం నిషేధించబడింది. ఇప్పుడు ఈ జాతుల దిగుమతి, వ్యాపారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.