యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్.. ఇకపై వాటికి కూడా చెల్లించాల్సిందే!
కరోనా మహమ్మారి రావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. థియేటర్లకు డిమాండ్ ను తగ్గించాయి. ఓటీటీల ప్రభావం వల్ల సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
- By Nakshatra Published Date - 10:38 PM, Thu - 22 December 22
కరోనా మహమ్మారి రావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. థియేటర్లకు డిమాండ్ ను తగ్గించాయి. ఓటీటీల ప్రభావం వల్ల సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే ఓటీటీల్లో కూడా చాలా వరకూ పోటీ పడుతున్నాయి. ఓటీటీలకు ఇటీవల విపరీతమైన డిమాండ్ రావడంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలతో పాటు దేశీయంగా కూడా అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సేవలు అందించడం మొదలు పెట్టాయి.
ఇప్పుడు కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం కామన్ అయిపోయింది. దీంతో ఓటీటీ సబ్స్క్రిప్షన్లు భారీగానే పెరుగుతూ వస్తున్నాయి. అయితే చాలా మంది ఫ్యామిలి, ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇతరులతో పాస్వర్డ్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. దాంతో ఒకే సబ్‌స్క్రిప్షన్‌పై చాలా మంది సినిమాలు, షోలు చూడటం ఇప్పుడు జరుగుతోంది.
తాజాగా దీనిపై నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌పై పాస్ వర్డ్ లు షేర్ చేసుకుంటూ చాలా మంది సినిమాలు చూసేస్తున్నారు. వాటి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల నష్టపోతున్నామనే కారణంతో నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతరులకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే ఛార్జీలు వసూలు చేయాలని షాక్ ఇచ్చింది.
ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి ఆ తర్వాత అందరికీ దీనిని వర్తింపజేయనున్నారు. ఒక్కో ఎక్స్ట్రా డివైజ్‌కు 2 నుంచి 3 డాలర్ల చొప్పున వసూలు చేసే అవకాశముందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పరిమిత సంఖ్యలో డివైజ్‌లలో లాగిన్‌కు వీలు కల్పిస్తూ వస్తున్నాయి. అయితే కొన్నింటిలో ఒక సారి ఒక డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే వీలుంటుంది. వాటన్నింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా తక్కువ కావడంతో అందరూ దీనిని విపరీతంగా వాడేస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
Related News
Akhil Akkineni : అయ్యగారు వచ్చి ఏడాది.. ఇంకా ఓటీటీలోకి రాని ఏజెంట్
తెలుగు చిత్ర పరిశ్రమలో విశిష్టమైన అక్కినేని కుటుంబానికి చెందిన వారసుడు అఖిల్ అక్కినేని ఎంతగానో ఎదురుచూసిన ' ఏజెంట్ ' చిత్రంలో నటించడంతో ఎన్నో ఆశలతో ప్రయాణం ప్రారంభించాడు .