Migrant boat sinks: పడవ బోల్తా.. 13 మంది మృతి
స్పెయిన్ (Spain)కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి పడవ (Boat) ఆ దేశ దక్షిణ తీరానికి సమీపంలో బోల్తా పడడంతో 13 మంది మొరాకోకు చెందిన వారి మృతదేహాలు లభ్యమైనట్లు మొరాకో మీడియా శనివారం తెలిపింది. పడవలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
- Author : Gopichand
Date : 01-01-2023 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
స్పెయిన్ (Spain)కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి పడవ (Boat) ఆ దేశ దక్షిణ తీరానికి సమీపంలో బోల్తా పడడంతో 13 మంది మొరాకోకు చెందిన వారి మృతదేహాలు లభ్యమైనట్లు మొరాకో మీడియా శనివారం తెలిపింది. పడవలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. కానరీ దీవుల వైపు వెళుతున్నారు. వీరిలో 24 మంది నేరుగా రక్షించబడ్డారని వార్తా సైట్ హెస్ప్రెస్ తెలిపింది. మరో 8 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. శుక్రవారం తీరం నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే పడవ రాతిని ఢీకొట్టి మునిగినట్లు సైట్ పేర్కొంది. లిబియాతో సహా ఉత్తర ఆఫ్రికా దేశాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు స్పెయిన్ ద్వారా యూరప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. కోస్ట్ గార్డ్‌లు శనివారం వందలాది మంది వలసదారులను రక్షించారు.
Also Read: Fire At South Delhi Old Age Home: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి