Rs 8200 Crores Fine : జాక్ మాపై మరో రూ.8200 కోట్ల ఫైన్.. ఎందుకు ?
Rs 8200 Crores Fine : అన్ని దేశాలు టెక్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటే.. చైనా మాత్రం ఫైన్లతో వాయగొడుతోంది..
- Author : Pasha
Date : 09-07-2023 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
Rs 8200 Crores Fine : అన్ని దేశాలు టెక్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటే.. చైనా మాత్రం ఫైన్లతో వాయగొడుతోంది..
ఇప్పటికే చైనీస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం “అలీబాబా”(యాంట్ గ్రూప్) అధినేత జాక్ మాను ఇబ్బందులపాలు చేసిన చైనా సర్కారు మరోసారి ఆయనపై కొరడా ఝుళిపించింది.
చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డాయంటూ యాంట్ గ్రూప్ కు చెందిన పలు కంపెనీలపై మరో రూ.8200 కోట్లు ($1 బిలియన్) జరిమానా విధించింది.
Also read :Robots Press Conference : రోబోల ప్రెస్ కాన్ఫరెన్స్.. ఫ్యూచర్ పై సంచలన వ్యాఖ్యలు
జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ పై ఈ భారీ ఫైన్ ను వేయడానికి గల(Rs 8200 Crores Fine) కారణాలను చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (CSRC) వెల్లడించింది. కార్పొరేట్ గవర్నెన్స్ కు విఘాతం, వినియోగదారుల భద్రతకు భంగం, బ్యాంకింగ్ మరియు బీమా చెల్లింపుల్లో అవకతవకలు, మనీలాండరింగ్, ఫండ్ సేల్స్ సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందు వల్లే ఫైన్ వేశామని ప్రకటించింది. తాము జోక్యం చేసుకొని ఆ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు మళ్ళీ యాంట్ గ్రూప్ లో జరగకుండా వ్యవస్థాగత సంస్కరణలు చేశామని వెల్లడించింది. దీనిపై స్పందించిన యాంట్ గ్రూప్.. “మేం చైనా ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉంటాం. లోపాలు సరిద్దుకుంటూ ముందుకుపోతాం.. సంస్థాగత పాలనను మరింత మెరుగుపరుస్తాం” అని తెలిపింది.