HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Has 3 Conditions Before America To End The War

యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iranian President Masoud Pezeshkian
Iranian President Masoud Pezeshkian

Masoud Pezeshkian  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.

— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు జరగకుండా కఠినమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే శాంతి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు

ఇరాన్ అధ్యక్షుడు శాంతి కోసం షరతులు విధిస్తున్న తరుణంలోనే ఆ దేశ సైన్యం నుంచి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫజల్ షెకార్చి ప్రభుత్వ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా తమ దేశంలోని పోర్టులపై దాడి చేస్తే, పర్షియన్ గల్ఫ్‌లోని ఏ ఒక్క పోర్టు, ఆర్థిక కేంద్రం, లేదా ఇతర ప్రాంతం సురక్షితంగా ఉండదని హెచ్చరించారు. “మా ఓడరేవులపై దాడులు జరిగితే, ఈ రీజియన్‌లోని అన్ని పోర్టులు, రేవులు మా చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయి” అని ఆయన పేర్కొన్నారు.

అంతేగాక‌ తమ పోర్టులపై దాడి జరిగితే ఇప్పటివరకు చేసిన దానికంటే చాలా భారీ స్థాయిలో సైనిక చర్య చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని దేశాలు తమ భూభాగాల నుంచి అమెరికన్లను తరిమికొట్టాలని కూడా షెకార్చి పిలుపునిచ్చారు. ఒకవైపు ఇరాన్ రాజకీయ నాయకత్వం శాంతి కోసం షరతులు పెడుతూనే, మరోవైపు సైనిక నాయకత్వం తీవ్రమైన పరిణామాల గురించి హెచ్చరించడం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్లిష్ట, ఉద్రిక్త పరిస్థితికి అద్దం పడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abolfazl Shekarchi
  • america
  • Iran
  • Israel.
  • Masoud Pezeshkian
  • Middle East conflict
  • Military Action
  • Persian Gulf
  • war conditions

Related News

Donald Trump

గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

Donald Trump  ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయగలమని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో, కాలిఫోర్నియా తీరంలో ఒక పడవ నుంచి డ్రోన్‌లతో దాడి చేసేందుకు ఇరాన్ పన్నుతున్న కుట్రపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించా

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Iran

    ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • Israel-Iran War: Donald Trump

    నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • New Supreme Leader Of Iran

    Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

Latest News

  • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

  • Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

  • విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd