Shrine Attack: ఇరాన్ దాడి కేసులో నిందితుల్ని ఉరితీసిన ప్రభుత్వం
ఇరాన్‌లో అక్టోబర్ 26 2022న ప్రసిద్ధ మందిరం దాడికి గురైన విషయం తెలిసిందే. షిరాజ్ నగరంలోని షా చెరాగ్ మందిరంపై గత అక్టోబర్ లో ఇద్దరు వ్యక్తులు మారణహోమం సృష్టించారు.
- Author : Praveen Aluthuru
Date : 08-07-2023 - 4:02 IST
Published By : Hashtagu Telugu Desk
Shrine Attack: ఇరాన్‌లో అక్టోబర్ 26 2022న ప్రసిద్ధ మందిరం దాడికి గురైన విషయం తెలిసిందే. షిరాజ్ నగరంలోని షా చెరాగ్ మందిరంపై గత అక్టోబర్ లో ఇద్దరు వ్యక్తులు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి చేసిన ప్రధాన నిందితులైన ఇద్దరు వ్యక్తుల్ని ఉరితీసినట్లు అక్కడి మీడియా శనివారం నివేదించింది.
నిందితులు మహ్మద్ రమేజ్ రషీదీ మరియు సయ్యద్ నయీమ్ హషేమీ ఖతాలీ కోసం దాఖలు చేసిన అప్పీల్‌ను ఇరాన్ సుప్రీం కోర్టు తిరస్కరించి వారికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. 22 ఏళ్ల మహ్సా అమినీ పోలీస్ కస్టడీలో మరణించింది.హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె మరణించింది. దీంతో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. ఆమె మరణించిన 40 రోజుల గుర్తుగా ఇరాన్ అంతటా ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో షా చెరాగ్ మందిరంపై దాడి జరిగింది. అయితే దాడిపై ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) టెర్రర్ గ్రూప్ బాధ్యత వహించింది.
Read More: 6000 Kg Bridge Theft : 6వేల కేజీల ఇనుప బ్రిడ్జినే దొంగిలించారు.. ఎలాగంటే ?