sex before marriage: ఆ దేశంలో పెళ్లి కంటే ముందు శృంగారం చేస్తే నేరం.. సంవత్సరం జైలు శిక్ష తప్పదు..!
పెళ్లికి ముందు సెక్స్‌కు సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
- By Gopichand Published Date - 08:21 AM, Sat - 3 December 22
పెళ్లికి ముందు సెక్స్‌కు సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండోనేషియా పార్లమెంట్లో కొత్త క్రిమినల్ కోడ్ ఆమోదం పొందబోతోంది, దీని కింద వివాహానికి ముందు సెక్స్ నేరంగా పరిగణించబడుతుంది. ఇలా చేసే వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష కూడా ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం.. ఇండోనేషియా పార్లమెంట్ త్వరలో ‘ది డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్’ని ఆమోదించబోతోంది.
ఈ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 413లోని 1వ పేరాలో ఇలా వ్రాయబడింది. ‘ఎవరైనా తన భర్త లేదా భార్య కాని వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉంటే, వ్యభిచారానికి పాల్పడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో అతనికి జరిమానా విధించబడుతుంది లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. అయితే.. అలా చేస్తున్న వ్యక్తి భర్త లేదా భార్య వ్యభిచారంపై ఫిర్యాదు చేసినప్పుడే లేదా నిందితుడు మైనర్ అయితే అతని తల్లిదండ్రుల తరపున ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు వరకు ఈ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవచ్చని మరో నిబంధన తెలుపుతుంది. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభించే ముందు ఆర్టికల్ 144 ప్రకారం అటువంటి ఫిర్యాదులను కూడా ఉపసంహరించుకోవచ్చు.
ఇండోనేషియా న్యాయ మంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ మాట్లాడుతూ.. ఇండోనేషియా ఆచారాలను అనుసరించే ఇలాంటి క్రిమినల్ కోడ్‌ను తీసుకురాబోతున్నందుకు మేము గర్విస్తున్నాము అని అన్నారు. ఇంతకుముందు ఇండోనేషియాలో దేశాన్ని లేదా అధ్యక్షుడిని అవమానించడం లేదా ప్రభుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకునేది ఇండోనేషియా ప్రభుత్వం. ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో మహిళలు, మైనారిటీలు, LGBT కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై వివక్ష చూపే వందలాది చట్టాలు ఉన్నాయి. పార్లమెంట్ తీసుకురాబోతున్న కొత్త చట్టం ఇండోనేషియా పౌరులతో పాటు ఆ దేశానికి వెళ్లే వ్యక్తులకు కూడా వర్తిస్తుంది.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.