HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >India Is Number 2 In Gdp Elon Musks Sensational Tweet

జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

  • Author : Vamsi Chowdary Korata Date : 02-02-2026 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Elon Musk
Elon Musk

Elon Musk  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్‌ -10 దేశాల జాబితాను మస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఐఎమ్ఎఫ్ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, ప్రపంచ జీడీపీలో 26.6 శాతం వాటాతో చైనా తొలి స్థానంలో నిలిచింది. 17 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 9.9 శాతం వాటాతో అమెరికా మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే చైనా, భారత్‌లు కలిపి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 43.6 శాతం వాటాను కలిగి వున్నాయి. ఈ గణాంకాలను ప్రస్తావించిన మస్క్.. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

Elon Musk

Elon Musk

ఇక ఐఎమ్ఎఫ్ అంచనాల ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా, 2027లో 3.2 శాతంగా ఉండనుంది. ఆధునిక సాంకేతికతలపై పెట్టుబడులు, ప్రభుత్వాల విత్త, ద్రవ్యపరపతి విధానాల మద్దతు, బలమైన ప్రైవేటు రంగం గ్లోబల్ ఎకానమీకి ఊతమిస్తున్నాయని ఐఎమ్ఎఫ్ తెలిపింది. ట్రంప్ విధించిన సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇవి అనేక దేశాలకు కీలకంగా మారాయని పేర్కొంది.

భారత్ విషయానికొస్తే, 2025 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్న ఐఎమ్ఎఫ్, ఈ ఏడాది, వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.4 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. చైనాలో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశముండగా, భారత్‌లో మాత్రం ప్రభుత్వ అంచనాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Donald Trump
  • Economic growth
  • elon musk
  • Elon Musk - India
  • Financial Power
  • global economy
  • IMF
  • india
  • trade
  • World GDP

Related News

Zero Tariffs

మే 1 నుండి దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు!

ఆఫ్రికా నుండి తక్కువ ధరకే ముడి సరుకులు, వనరులు సులభంగా లభిస్తాయి. ప్రపంచ వేదికపై అమెరికా వంటి దేశాలు టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుంటే చైనా మాత్రం తాము ‘స్వేచ్ఛా వాణిజ్యానికి, సహకారానికి’ సిద్ధమని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.

  • Strait Of Hormuz

    మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారీ తీర్మానానికి అడ్డుప‌డిన వీటో ప‌వ‌ర్‌!

  • Stock Market Crash

    Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • Gold Price Today

    Gold Price: పసిడి ప్రియులకు షాక్

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd