HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Stock Market In Heavy Losses

Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stock Market Crash
Stock Market Crash

Donald Trump  అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పెరిగి 106 డాలర్ల వద్దకు చేరింది. ఈ ప్రభావంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,416 పాయింట్లు నష్టపోయి 71,718 వద్ద, నిఫ్టీ 429 పాయింట్లు కోల్పోయి 22,250 దిగువన ట్రేడ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు 3 శాతానికి పైగా పతనమయ్యాయి.

నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు మార్కెట్‌ను కిందకు లాగడంలో కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ 50 సూచీలో హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే స్వల్ప లాభంతో గ్రీన్‌లో ఉన్న ఏకైక షేరుగా నిలిచింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో భయానక వాతావరణానికి సూచిక అయిన ఇండియా VIX ఇండెక్స్ 6 శాతానికి పైగా పెరిగింది. బుధవారం సానుకూలంగా ముగిసిన మార్కెట్లు ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పతనం కావడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brent Crude Oil
  • Donald Trump
  • Indian Stock Market
  • Indian stock market fall
  • Indian stock markets
  • Nifty
  • sensex
  • share market
  • Share Market Today
  • Stock Market Crash
  • Stock Market Crash LIVE
  • Stock Market Crash Today

Related News

Highly Emotional Atmosphere

Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, భద్రతా, విదేశాంగ విధానాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తేహ్రాన్ వీధుల్లో కనిపిస్తున్న జనసందోహం దేశంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితికి ప్రతిబింబంగా నిలుస్తోంది

  • Trump warns China over Panama Canal: We will not allow it.

    Donald Trump: పనామా కాలువ విషయంలో చైనాను హెచ్చరించిన ట్రంప్: దీనిని మేము అనుమతించము.

  • Stock market ends with gains.

    Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

Latest News

  • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

  • Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd