China Tech: చైనాలో మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ లేకపోవడానికి బిగ్ రీజన్ ఇదేనా..?
మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపాలు చైనా (China Tech)లో ఎటువంటి ప్రభావం చూపలేదు. చైనాలో ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్ రంగానికి సాధారణ పనిని కొనసాగించింది.
- By Gopichand Published Date - 09:55 PM, Sun - 21 July 24

China Tech: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుట్‌డేజ్ కారణంగా ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. బ్లూ స్క్రీన్ లోపం కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ నుండి బ్రాడ్‌కాస్టింగ్ వరకు సేవలు నిలిచిపోయాయి. కానీ ప్రపంచంలోని ఒక్క దేశంపైనా ఈ అంతరాయం ప్రభావం కనిపించలేదు. ఆ ఎఫెక్ట్ లేని దేశంగా చైనా వార్తల్లోకెక్కింది. మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపాలు చైనా (China Tech)లో ఎటువంటి ప్రభావం చూపలేదు. చైనాలో ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్ రంగానికి సాధారణ పనిని కొనసాగించింది. చైనా తన పనిలో ఇతర దేశాల ఎప్పుడూ సహాయం తీసుకోదు. ఈ కారణంగా చైనాపై మైక్రోసాఫ్ట్ అంతరాయ ప్రభావం కనిపించలేదు. అయితే చైనా సొంత సాఫ్ట్‌వేర్ వాడటంతో ఆ దేశంలో మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ లేదని ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
చైనాలో మైక్రోసాఫ్ట్ లోపం వల్ల ఎలాంటి అవాంతరాలు కనిపించలేదు. చైనా మీడియా ప్రకారం.. లోపం కారణంగా ఇక్కడ ఎటువంటి సమస్య కనిపించలేదని తెలిపింది. కానీ షాంఘైలోని ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ ప్రకారం.. బ్లూ స్క్రీన్ లోపం గురించి ఆమె కార్యాలయంలో చాలా మంది ఫిర్యాదు చేశారు. రికవరీ సందేశం బ్లూ స్క్రీన్‌పై కూడా కనిపించింది. విండోస్ సరిగ్గా అప్ లోడ్ కాలేదని మెసేజ్ రాసింది. చైనా ప్రజలు అంతర్జాతీయ హోటళ్లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై X (గతంలో ట్విట్టర్)లో వేలాది మంది స్పందించారు.
ఒక సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది
అమెరికన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ద్వారా ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించిన విషయం మనకు తెలిసిందే. దీని కారణంగా మొత్తం ప్రపంచం పనితీరుపై ప్రభావితమైంది. ఈ అప్‌డేట్ క్రౌడ్ స్ట్రైక్ సిస్టమ్‌ను మరింత సురక్షితం చేయడానికి తయారుచేశారు. తద్వారా సైబర్ హ్యాకర్ల నుంచి రక్షణ పొందవచ్చు. కానీ అప్‌డేట్‌లో లోపం కారణంగా స్క్రీన్‌పై నీలం రంగు సందేశం కనిపించడం ప్రారంభించింది. ఈ కారణంగా సిస్టమ్‌లు వాటంతటికి అవే షట్ డౌన్ అయ్యాయి. అలాగే రీస్టార్ట్ కూడా అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
దీన్ని సాధారణ భాషలో BSOD అంటారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సిస్టమ్‌లో లోపం కారణంగా వ్యాపారం దెబ్బతింటుంది అనే వాస్తవాన్ని తాము అంగీకరిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు. వినియోగదారులకు సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యమని కంపెనీ తెలిపింది.