HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Hindu Man Shot Dead In Bangladesh Fifth In 3 Weeks

బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!

రాణా ప్రతాప్ బైరాగి హత్యతో కలిపి గత మూడు వారాల్లో బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై జరిగిన 5వ ప్రధాన దాడి ఇది. సమాచారం ప్రకారం.. రాణా ప్రతాప్‌పై ఆకస్మికంగా దాడి జరిగింది.

  • Author : Gopi Date : 05-01-2026 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hindu Man Dead
Hindu Man Dead

Hindu Man Dead: బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జెస్సోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో సోమవారం (జనవరి 5) మధ్యాహ్నం చోటుచేసుకుంది. 45 ఏళ్ల రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. పొరుగు దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందువులపై జరుగుతున్న దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

రాణా ప్రతాప్ బైరాగి హత్యతో కలిపి గత మూడు వారాల్లో బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై జరిగిన 5వ ప్రధాన దాడి ఇది. సమాచారం ప్రకారం.. రాణా ప్రతాప్‌పై ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రాణా ప్రతాప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారు ఎవరు? హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలు, ఉద్రిక్తతల మధ్య హిందూ మైనారిటీల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజివుల్లా ఖాన్ స్పందిస్తూ.. మేము ఘటనా స్థలంలో ఉన్నాము. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలిపారు.

Also Read: వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

ఖోకన్ చంద్ర దాస్‌పై కత్తులతో దాడి, సజీవ దహనం

దీనికి ముందు డిసెంబర్ 31, 2025న (కొత్త ఏడాది వేడుకల సందర్భంగా) షరియత్‌పూర్ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై దుండగుల గుంపు కత్తులతో దాడి చేసి, ఆపై ఆయనకు నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఢాకాలోని నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 3) ఉదయం మరణించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Hindu Man Dead
  • Jashore
  • Manirampur
  • murder
  • world news

Related News

Retired IPS Officer Wife Incident in Jubilee Hills

Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏ

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd