Tiny Skeleton: 166 మిలియన్ ఏళ్ల నాటి బల్లి అస్థిపంజరం లభ్యం..!
స్కాట్‌లాండ్‌లో 166 మిలియన్ సంవత్సరాల నాటి బల్లి శిలాజం బయటపడిందని..
- By Gopichand Published Date - 06:33 PM, Fri - 28 October 22

డైనోసార్ల కాలంలో బల్లుల ప్రారంభ పరిణామంపై స్కాట్లాండ్‌లోని శిలాజ ఆవిష్కరణ కొత్త సమాచారాన్ని వెలుగులోకి తెచ్చిందని ఒక పరిశోధన తెలిపింది. ఐల్ ఆఫ్ స్కైలో కనుగొనబడిన బెల్లార్సియా గ్రాసిలిస్ అనే చిన్న అస్థిపంజరం కేవలం ఆరు సెంటీమీటర్ల పొడవు, 166 మిలియన్ సంవత్సరాల క్రితం మధ్య జురాసిక్ కాలం నాటిదని అధ్యయనం తెలిపింది. స్కాట్‌లాండ్‌లో 166 మిలియన్ సంవత్సరాల నాటి బల్లి శిలాజం బయటపడిందని, ఈ అస్థిపంజరం ద్వారా సరీసృపాలు ఎలా ఉద్భవించాయో తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మధ్య జురాసిక్ కాలానికి బల్లి అస్థిపంజరం 6 సెంటీమీటర్ల వరకు ఉంది. అయితే దాని ముక్కు, తోక లభించలేదు. ప్రపంచంలో కనుగొన్న బల్లి శిలాజాల్లో అతి పురాతనమైనదిగా నమ్ముతున్నారు.