Meta Fined: మెటా సంస్థకు షాక్.. రూ.53 కోట్ల జరిమానా విధించిన ఇటలీ..!
సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్ ఫామ్స్ పై రూ.53 కోట్ల జరిమానా (Meta Fined) విధించారు. ఇటలీలో కంపెనీపై ఈ చర్య తీసుకున్నారు.
- By Gopichand Published Date - 01:55 PM, Sat - 23 December 23

Meta Fined: తాజాగా అమెరికాలో దిగ్గజ కంపెనీ గూగుల్ కు మిలియన్ డాలర్ల జరిమానా పడింది. ఇప్పుడు సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్ ఫామ్స్ పై రూ.53 కోట్ల జరిమానా (Meta Fined) విధించారు. ఇటలీలో కంపెనీపై ఈ చర్య తీసుకున్నారు. ఇటలీలో నిషేధించబడిన జూదానికి సంబంధించిన ప్రకటనలు చూపించారని మెటాపై ఆరోపణలు వచ్చాయి.
ఇటలీ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ AGCOM ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లు, ఖాతాల ద్వారా మెటా జూదం ప్రకటనలను చూపుతుందని ఆరోపించారు. ఇది కాకుండా జూదం లేదా ఆటలలో నగదు బహుమతులు ఇచ్చే కంటెంట్‌ను కంపెనీ ప్రచారం చేస్తోందని అన్నారు. దింతో AGCom శుక్రవారం కంపెనీపై 5.85 మిలియన్ యూరోలు ($6.45 మిలియన్లు) జరిమానా విధించింది.
Also Read: Chimpanzees : చింపాంజీలు, బోనోబోల మెమొరీ పవర్‌పై సంచలన నివేదిక
ఇటలీ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ AGCOM అటువంటి ప్రకటనలను చూపినందుకు అనేక కంపెనీలకు ఒకదాని తర్వాత ఒకటి జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ అంశంపై మేటా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెల ప్రారంభంలో AGCom ఆల్ఫాబెట్ ఇంక్ యూట్యూబ్‌పై 2.25 మిలియన్ యూరోలు, ట్విచ్‌పై ఇలాంటి ఆరోపణలపై 9 లక్షల యూరోలు జరిమానా విధించింది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాలో గూగుల్ పై 700 మిలియన్ డాలర్ల జరిమానా
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్‌పై అమెరికా కోర్టు దాదాపు 700 మిలియన్ డాలర్ల జరిమానా విధించినట్లు డిసెంబర్ 21వ తేదీన వార్తలు వచ్చాయి. ఇందులో $630 మిలియన్లను 100 మిలియన్ల మందికి పంపిణీ చేస్తారు. $70 మిలియన్లను ఫండ్‌లో జమ చేస్తారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌ను దుర్వినియోగం చేసి వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేసిందని కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో యాప్‌లో కొనుగోళ్లు, ఇతర పరిమితులను విధించడం ద్వారా కంపెనీ ఈ డబ్బును వసూలు చేస్తోంది.