HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Elon Musks Big Push For Us Exit From Nato Can Nato Survive Without Us

US Vs NATO : ‘నాటో’ నుంచి అమెరికా బయటికొస్తుందా ? వాట్స్ నెక్ట్స్ ?

ఇందుకు కొనసాగింపుగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Vs NATO)  కీలక వ్యాఖ్యలు చేశారు. 

  • By Pasha Published Date - 07:54 PM, Sun - 9 March 25
  • daily-hunt
Us Vs Nato Elon Musk Us Nato United States Donald Trump Doge

US Vs NATO : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (డోజ్) విభాగం సారథి హోదాలో అమెరికా ప్రభుత్వంలో మస్క్ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమైన అంశాలపై ప్రెసిడెంట్ ట్రంప్‌కు తనదైన శైలిలో ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాటో కూటమి చాలా పవర్ ఫుల్. ఏకంగా రష్యాను సవాల్ చేయగల సత్తా నాటో సొంతం. నాటో అంటే నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (NATO). అమెరికా, ఐరోపా దేశాల సంయుక్త సైనిక కూటమికి నాటో అనే పేరును పెట్టారు. నాటో కూటమి నుంచి అమెరికా బయటికి వచ్చేయాలని తాజాగా ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ సంచలన సూచన చేశారు.  ఐక్యరాజ్యసమితి నుంచి కూడా అమెరికా బయటికి వస్తే బాగుంటుందన్నారు. నాటో, ఐరాసలో ఉండటం వల్ల అమెరికా ప్రభుత్వం అనవసర అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని మస్క్ పేర్కొన్నారు.  నాటో కూటమిలోని ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా బడ్జెట్ కేటాయించడం అనే సంప్రదాయాన్ని ఇకనైనా ఆపాలని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read :MLA Quota MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌

ట్రంప్ సంచలన రియాక్షన్

‘‘నా కంపెనీ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఆపేస్తే ఇక  రష్యాతో ఉక్రెయిన్ యుద్ధమే చేయలేదు. అంత దారుణ స్థితిలో ఉక్రెయిన్ ఉంది’’ అని మస్క్ పేర్కొన్నారు. ఇందుకు కొనసాగింపుగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Vs NATO)  కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘నాటో కూటమి కోసం కేవలం అమెరికాయే నిధులను ఇవ్వాలంటే ఇక కుదరదు. మేం మాత్రమే ఖర్చులు భరించడం అన్యాయం. కూటమిలోని ఇతర దేశాలు కూడా తమవంతుగా నిధులు ఇవ్వాలి. లేదంటే నాటో కూటమిలోని దేశాల నుంచి మా దళాలను వెనక్కి తీసుకుంటాం’’ అని ట్రంప్ గట్టి వార్నింగ్  ఇచ్చారు. తదుపరిగా ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? నాటో నుంచి అమెరికాను బయటికి తీసుకొస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :SSMB29 Leak : ఆయన ఎదుట మోకరిల్లిన మహేశ్‌బాబు.. ‘ఎస్ఎస్ఎంబీ-29’ లీక్

అమెరికా ఎగ్జిట్ అయితే.. 

ఒకవేళ అమెరికా ఎగ్జిట్ అయితే నాటో కూటమి బలహీనపడే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఐరోపా దేశాలు సైనికపరంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు అంటున్నారు. రష్యాను బలంగా ఢీకొనాలంటే తమకు అమెరికా సహకారం అవసరమని ఐరోపా దేశాలకు తెలుసు. అందుకే తమవంతు నిధులను ఇచ్చేందుకే ఐరోపా దేశాలు మొగ్గుచూపొచ్చు. అమెరికా సైతం నాటో నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు దాదాపు లేవట. ఒకవేళ అమెరికా ఎగ్జిట్ అయితే, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలకు దగ్గరయ్యేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. అదే జరిగితే రష్యా భౌగోళిక బలం పెరుగుతుంది. అమెరికా అస్సలు నచ్చని విషయం ఇదే. అందుకే నాటో నుంచి అమెరికా నిష్క్రమణ అనేది అసాధ్యమని విశ్లేషిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DOGE
  • Donald Trump
  • elon musk
  • NATO
  • United States
  • us
  • US Vs NATO

Related News

Donald Trump

Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

  • TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

  • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

  • Woman Suicide : చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

  • PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd