Donald Trump Twitter account: మస్క్ మామూలోడు కాదు.. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది.
- By Gopichand Published Date - 12:35 PM, Sun - 20 November 22

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది. ఎలాన్ మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. అంతకుముందు ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని ట్విట్టర్‌లో మస్క్ ఓ పోల్ కూడా నిర్వహించాడు. అందులో చాలా వరకు ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని తమ అభిప్రాయాన్ని పోల్ లో తెలియజేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా త్వరలో పునరుద్ధరించబడుతుందని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ తెలిపారు. అంతకుముందు.. మస్క్ ఈ ఏడాది మేలో ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేయవచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే. గతేడాది అమెరికా పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది.
ఎలాన్ మస్క్ ఇటీవల ఒక పోల్‌ను ట్విట్టర్ లో నిర్వహించారు. దీనిలో ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని వినియోగదారులు అడిగారు. దీనిపై 51.8 శాతం మంది వినియోగదారులు ఖాతా పునరుద్ధరించడానికి అనుకూలంగా ఓటు వేయగా.. 48.2 శాతం మంది వినియోగదారులు ఖాతాను పునరుద్ధరించకూడదని అనుకూలంగా ఓటు వేశారు. ఈ పోల్‌లో మొత్తం 1,50,85,458 మంది పాల్గొన్నారు. అదే సమయంలో పోల్‌ను 135 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.
మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు ట్రంప్‌తో సహా పలు ఖాతాలపై విధించిన ఆంక్షలను మూర్ఖపు వైఖరిగా పేర్కొన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించినా అయితే ట్రంప్ ప్లాట్‌ఫారమ్‌కు తిరిగి వస్తారా అనేది ప్రశ్నగా మారింది. తన ఖాతాను పునరుద్ధరించినా తాను ట్విట్టర్‌లోకి తిరిగి రానని ట్రంప్ గతంలోనే చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు ట్రూత్ సోషల్ అనే చిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉంది. ట్విట్టర్ అతన్ని బ్లాక్ చేసినప్పటి నుంచి ట్రంప్ దానిని ఉపయోగిస్తున్నారు.
The people have spoken.
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv
— Elon Musk (@elonmusk) November 20, 2022