Earthquake: పపువా న్యూ గినియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు..!
యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. పాపువా న్యూ గినియాలోని వెవాక్‌కు ఈశాన్య 76 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
- By Gopichand Published Date - 09:04 AM, Thu - 5 September 24
Earthquake: ఇవాళ ఉదయం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైన భూకంపం పపువా న్యూ గినియాలోని తీరప్రాంత నగరాలను తాకింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ భూకంపాన్ని ధృవీకరించింది. సెప్టెంబర్ 5, గురువారం ఉదయం పాపువా న్యూ గినియాలోని వోకియో ద్వీపానికి సమీపంలో ఉన్న బిస్మార్క్ సముద్రంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్రంలో 10 కిలోమీటర్ల (6 మైళ్లు) లోతులో ఉంది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనప్పటికీ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వారిలో భయాందోళన వాతావరణం నెలకొంది.
భూకంపం 2 నగరాలకు అత్యంత ప్రమాదకరమైనది
యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. పాపువా న్యూ గినియాలోని వెవాక్‌కు ఈశాన్య 76 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం సంభవించిన ప్రాంతంలో ఈ తీవ్రతతో కూడిన భూకంపం ఆర్థిక నష్టం కలిగించే అవకాశం లేదు. అయితే 6 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడం పెద్ద భూకంపం హెచ్చరిక. వెవాక్ జనాభా 18,200, దానికి 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగోరం జనాభా 1600. ఈ రెండు నగరాలు భూకంపాల వల్ల చాలా ప్రమాదంలో ఉన్నాయి. అందువల్ల భూకంప ప్రకంపనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రభుత్వం, ప్రజలను అప్రమత్తం చేసింది.
Also Read: Dry Fruits: నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే..!
ఫిలిప్పీన్స్‌లో నిన్న రెండుసార్లు భూకంపం సంభవించింది
ఆగస్టు 4న ఫిలిప్పీన్స్‌లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం భారత కాలమానం ప్రకారం ఉదయం 5.45 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కసుగురాన్‌కు 31 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం భూమికింద 28 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. రెండవ భూకంపం కూడా అదే ప్రాంతంలో సంభవించింది. అరగంట తరువాత 5:30 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికింద 10 కిలోమీటర్ల లోతులో కనుగొనబడింది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Russia Ukraine War: అజిత్ దోవల్ రష్యా పర్యటన వెనుక మోడీ మంత్రమేంటి ?
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రధాని మోదీ చాలాసార్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అజిత్ దోవల్ రష్యా పర్యటన చర్చనీయాంశంగా మారింది.