Earthquake: కోస్టారికా, పనామాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదు..!
కోస్టారికా, పనామాలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇది చోటుచేసుకుంది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది.
- By Gopichand Published Date - 12:26 PM, Wed - 5 April 23

కోస్టారికా, పనామాలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇది చోటుచేసుకుంది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. భూమి లోపల 31 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మధ్య అమెరికా దేశాలైన కోస్టారికా, పనామాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. కోస్టారికా రాజధాని శాన్ జోస్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 31 కి.మీ లోతులో ఉంది. ప్రస్తుతం భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం లేదు.
Also Read: Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విడుదల.. అమెరికా నాశనమవుతోందని కామెంట్స్..!
అదే సమయంలో US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. పనామా తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని స్థానిక అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం చిరికీ ప్రావిన్స్‌లోని బోకా చికాకు దక్షిణంగా 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొరుగున ఉన్న కోస్టా రికా రాజధాని శాన్ జోస్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. కోస్టారికాలో కూడా భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని నేషనల్ ఎమర్జెన్సీ కమిషన్ తెలిపింది.
మీడియా కథనాల ప్రకారం.. పనామాలో భూకంపం కారణంగా స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆటగాడు నేలపై పడిపోయాడు. దాని వీడియో టీవీలో ప్రసారమైంది. మైదానంలో ప్రకంపనలు రావడం, స్టేడియం లైట్లు ఆరిపోవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. USGS ప్రకారం.. భూకంపం కేంద్రం భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో ఉంది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది.