HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Donald Trump Admin Freezes All Foreign Aid By Us Including That To Ukraine Only Israel Exempted

Foreign Aid Freeze : ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. రష్యాకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం

తదుపరిగా రష్యాతో శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపే క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని ట్రంప్(Foreign Aid Freeze) ఆపేసినట్లు తెలుస్తోంది.

  • By Pasha Published Date - 07:56 AM, Sat - 25 January 25
  • daily-hunt
Donald Trump Us Govt Foreign Aid Freeze Ukraine Israel

Foreign Aid Freeze : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు  షాకిచ్చే నిర్ణయం ఇది. ఉక్రెయిన్ సహా చాలా దేశాలకు అందిస్తున్న ఆర్థిక, సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  కేవలం ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు తమ ఆర్థిక,  సైనిక సహాయం కొనసాగుతుందని తెలిపారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తదుపరిగా ఏం చేస్తుందో వేచిచూడాలి. రష్యా లాంటి అణ్వాయుధ దేశంతో గత రెండున్నర ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేసిందంటే దానికి కారణం.. అమెరికా చేసిన సాయం!! లేదంటే ఇప్పటివరకు యుద్ధ బరిలో రష్యా ఎదురుగా ఉక్రెయిన్ నిలువలేకపోయేది.

Also Read :Vijayasai Reddy : విజయసాయి రాజీనామా వెనుక వ్యూహం ఏంటి..?

ఇజ్రాయెల్, ఈజిప్టులకు కంటిన్యూ

తదుపరిగా రష్యాతో శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపే క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని ట్రంప్(Foreign Aid Freeze) ఆపేసినట్లు తెలుస్తోంది. అమెరికా నిధులు విదేశాలకు మళ్లడాన్ని ఆపుతానని, వాటిని తమ దేశ వికాసానికి వినియోగిస్తానని ట్రంప్ మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు. డీలాపడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందాలంటే విదేశాలకు సాయాలను ఆపాలనేది ట్రంప్ వాదన. పశ్చిమాసియాలో అమెరికాతో వ్యూహాత్మక సైనిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఇజ్రాయెల్, ఈజిప్టులకు మాత్రం సాయాన్ని కంటిన్యూ చేయనున్నారు.

Also Read :Kodali Nani Resign : వైసీపికి కొడాలి నాని రాజీనామా..? అసలు నిజం ఇదే..!!

అమెరికా నిధులు అమెరికా ప్రయోజనాల కోసమే

‘‘నూతన ప్రభుత్వం సమీక్షించి, తుది నిర్ణయం తీసుకున్నాకే తదుపరిగా విదేశాలకు ఆర్థికసాయం ప్రక్రియ మొదలవుతుంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ నిధులు అమెరికా ప్రయోజనాల కోసమే ఉపయోగపడాలి అనేది దేశాధ్యక్షుడు ట్రంప్ విధానమని ఆయన తేల్చి చెప్పారు.  ఈమేరకు ట్రంప్ సర్కారు ఒక అధికారిక మెమోను జారీ చేసింది. కాగా, ట్రంప్ తాజా ప్రకటనతో ఆఫ్రికా దేశాలకు బాగా ఇబ్బంది కలగనుంది. ఆ దేశాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిరోధక కార్యక్రమాల అమలు కోసం ఏటా పెద్దమొత్తంలో యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్‌ను అమెరికా సరఫరా చేస్తుంటారు. జార్జ్ బుష్ హయాంలో 2003 నుంచి ఆఫ్రికా దేశాలకు ఈ మందులను అమెరికా అందిస్తోంది. ఇప్పుడు వాటి పంపిణీ జరగకుంటే ఆయా దేశాల్లో ఎయిడ్స్ వ్యాప్తి పెరిగే ముప్పు ఉంది.  


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Foreign Aid Freeze
  • Israel.
  • ukraine
  • us
  • US Govt

Related News

Donald Trump

Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd