New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో తెలుసా?
భారతదేశానికి ముందు న్యూజిలాండ్, కిరిబాటి, సమోవా, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, టోంగా, రష్యా, జపాన్, మయన్మార్, ఇండోనేషియాలు ముందుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి.
- By Gopichand Published Date - 07:30 AM, Wed - 1 January 25

New Year Celebrations: దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు సందడిగా కొనసాగాయి. 2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం (New Year Celebrations) పలుకుతూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. డీజే మోతలతో డ్యాన్సులు చేస్తూ.. టపాసులు పేల్చుకుంటూ పరస్పరం హ్యపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరూ చిన్న, పెద్ద తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే భారత్ కంటే ముందు కొన్ని దేశాలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
With China 🇨🇳, Taiwan 🇹🇼, Hong Kong 🇭🇰, the Philippines 🇵🇭, Malaysia 🇲🇾, Singapore 🇸🇬, and western Australia 🇦🇺 all welcoming the New Year, roughly a quarter of the world's population just entered 2025 at the same time.#HappyNewYear pic.twitter.com/y7xsbRELoP
— James Cosgrove (@MrJamesCosgrove) December 31, 2024
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు కాలామానాలు ఉన్నాయి. దీని కారణంగా నూతన సంవత్సర వేడుకలు కూడా భిన్నంగా జరుపుకుంటారు. అన్నింటిలో మొదటిది కిరిటిమతి ద్వీపం (క్రిస్మస్ ద్వీపం) లో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ద్వీపం కిరిబాటి రిపబ్లిక్‌లో భాగం. భారత కాలమానం గురించి చెప్పాలంటే.. ఇక్కడ టైమ్ జోన్ దాదాపు ఏడున్నర గంటలు ముందుంది. ప్రపంచంలోని 41 దేశాలు భారతదేశానికి ముందుగా తమ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాయి.
HAPPY NEW YEAR 2025 AUSTRALIA 🇦🇺 🎆 pic.twitter.com/QN5vtaFGLO
— WORLD 2024 🌊 (@W0rld2K24) December 31, 2024
Also Read: Indian Batsman: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లు వీరే!
భారతదేశానికి ముందు న్యూజిలాండ్, కిరిబాటి, సమోవా, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, టోంగా, రష్యా, జపాన్, మయన్మార్, ఇండోనేషియాలు ముందుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి. సింగపూర్‌లోనూ నూతన సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. పెద్దఎత్తున బాణాసంచా కాల్చడం, సంబరాలు చేసుకోవడం ఇక్కడి ప్రజల మధ్య కనిపించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ నగరాల్లో కూడా ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ప్రపంచం 24 సమయ మండలాలుగా విభజించబడింది. ఈ సమయ మండలాలు రేఖాంశం ఆధారంగా సృష్టించబడ్డాయి. ప్రతి దేశానికి దాని స్వంత ప్రామాణిక సమయం ఉంటుంది.
చైనా, తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి. చాలా నగరాల్లో బాణాసంచా కాల్చటం కనిపించింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌తో పాటు, ప్రపంచంలోని అనేక దేశాలలో శక్తివంతమైన బాణసంచా కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆక్లాండ్ ప్రసిద్ధ క్లాక్ టవర్ పూర్తిగా లైట్లతో వెలిగిపోయింది.