Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ వివరాలివీ
ప్రణయ్‌ను(Pranay Murder Case) మిర్యాలగూడలో హత్య చేసిన వెంటనే సుభాష్‌శర్మ బిహార్‌లోని తన సొంతూరికి వెళ్లిపోయాడు.
- By Pasha Published Date - 02:37 PM, Tue - 11 March 25

Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసులో దోషిగా తేలిన సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇంతకీ ఇతడు ఎవరు ? ఎక్కడి వాడు ? ప్రణయ్ హత్యలో పాత్ర ఏమిటి ? పోలీసులకు ఎలా చిక్కాడు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :X Cyber Attack: ‘ఎక్స్’పై సైబర్ ఎటాక్.. ‘డార్క్ స్టార్మ్’ పనా ? ‘ఉక్రెయిన్’ పనా ?
సుభాష్ శర్మ ఎవరు ? సుపారీ ఎలా తీసుకున్నాడు ?
- సుభాష్‌శర్మ.. బిహార్ రాష్ట్రంలోని సమస్తీ పూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందినవాడు.
- అతడు 13 ఏళ్లకే ఓటరు గుర్తింపు కార్డును అక్రమంగా సంపాదించాడు.
- సుభాష్ తొలుత ఆయుధాలను అక్రమంగా సప్లై చేసేవాడు. ఈక్రమంలో అరెస్టు చేసి, మహారాష్ట్రలోని పూణే జైలుకు పంపారు.
- 2011లో ఏపీలోని రాజమండ్రిలో ఓ బంగారు దుకాణంలో దొంగతనం చేస్తూ సుభాష్ దొరికిపోయాడు.
- సుభాష్ రాజమండ్రి జైలులో ఉండగా.. గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్‌బారీ, అస్గర్ అలీలతో పరిచయం ఏర్పడింది. వాళ్లు రూ.కోటి వరకు ఇస్తామంటూ.. ప్రణయ్‌ను హత్య చేసేందుకు సుభాష్ శర్మను ఒప్పించారు.
- అమృత (ప్రణయ్ భార్య) తండ్రి మారుతీ రావు నుంచి అబ్దుల్‌బారీ, అస్గర్ అలీలకు డబ్బులు అందాయి. ఆ డబ్బులనే ప్రణయ్‌కు ఇచ్చారు.
- ప్రణయ్‌ను హత్య చేసేందుకు నెల రోజుల వ్యవధిలో సుభాష్ శర్మ నాలుగైదుసార్లు రెక్కీ చేశాడు. అయితే టైమింగ్ సెట్ కాలేదు.
- ఐదోసారి రెక్కీ నిర్వహించిన సమయంలో టైమింగ్ కుదరడంతో ప్రణయ్‌ను సుభాష్‌శర్మ హత్య చేశాడు.
- ప్రణయ్‌ను(Pranay Murder Case) మిర్యాలగూడలో హత్య చేసిన వెంటనే సుభాష్‌శర్మ బిహార్‌లోని తన సొంతూరికి వెళ్లిపోయాడు.
- ఈ కేసును నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం ఉన్న పోలీసు అధికారి బాషాను బిహార్‌కు పంపారు.
- బాషా బిహార్‌కు వెళ్లి, సమస్తీపూర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించలేదు.
- దీంతో తాను ఎన్ఐఏలో పనిచేసినప్పుడు పరిచయమైన ఓ ఎస్పీ స్థాయి అధికారిని బాషా సంప్రదించారు. ఆయన ద్వారా సమస్తీపూర్ పోలీసుల సహకారాన్ని బాషా పొందారు.
- చివరకు సుభాష్‌శర్మ సొంతూరు జగత్‌సింగ్‌పూర్‌కు బాషా అండ్ టీమ్ చేరుకున్నారు.
- ఆ ఊరిలో సుభాష్‌శర్మను బాషా అండ్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పోలీసులపై సుభాష్‌శర్మ సోదరుడు, వందమంది వరకు దాడికి యత్నించారు. వారి వాహనాలను చాలాదూరం వెంబడించారు.
- ఎలాగోలా కష్టపడి సుభాష్‌శర్మను పాట్నాకు బాషా తరలించారు. పాట్నా నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి నల్గొండకు తీసుకొచ్చారు.