China Auto Investments In India: భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దు.. ఆటో రంగానికి చైనా హెచ్చరిక..!
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో డజనుకు పైగా ఆటో తయారీదారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దని వాహన తయారీదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది.
- By Gopichand Published Date - 03:22 PM, Sun - 15 September 24

China Auto Investments In India: ఆటో పరిశ్రమలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలన్నీ ముందుకు వస్తుండగా.. బయట పెట్టుబడులు పెట్టవద్దని చైనా తమ దేశ కార్ల తయారీదారులకు )China Auto Investments In India) సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సాంకేతికత దేశంలోనే ఉండాలని చైనా చెబుతోంది. అయితే చైనా కంపెనీలు టారిఫ్‌లను ఎగవేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్ల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయి.
మీడియా నివేదికల ప్రకారం.. నాక్ డౌన్ కిట్‌లను ఎగుమతి చేయడానికి చైనా అన్ని ఆటో తయారీదారులను ప్రోత్సహిస్తోంది. అన్ని వాహనాల ప్రధాన భాగాలను చైనాలో తయారు చేయాలని, ఆపై వాటిని ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న ఫ్యాక్టరీలలో అసెంబుల్ చేయాలని బీజింగ్ చెబుతోంది. ఇది చైనా కంపెనీలను సుంకాల నుండి కాపాడుతుంది.
Also Read: Next Delhi CM : నెక్ట్స్ ఢిల్లీ సీఎం ఎవరు ? కేజ్రీవాల్ ప్రయారిటీ ఎవరికి ?
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో డజనుకు పైగా ఆటో తయారీదారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దని వాహన తయారీదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. అయితే దీనికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. EV పరిశ్రమకు సంబంధించిన ప్రమాదాలను నివారించడానికి చైనా ఈ ఉత్తర్వును జారీ చేసి ఉండవచ్చు. నివేదికలను విశ్వసిస్తే.. టర్కీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కార్ల తయారీదారులు చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. కార్ల తయారీదారులు దీనిని టర్కీలోని చైనీస్ ఎంబసీకి నివేదించవచ్చు.
అనేక చైనా కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్న సమయంలో బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనీస్ కంపెనీ BYD, చెరీ ఆటోమొబైల్ వంటి కంపెనీలు థాయ్‌లాండ్, స్పెయిన్, హంగేరిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు చైనా కొత్త నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.