China Number 1 : అప్పులివ్వడంలో అమెరికాను దాటేసిన చైనా.. లెక్కలివీ
China Number 1 : ప్రపంచంలోనే ఎక్కువ దేశాలకు అప్పులు ఇచ్చిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది.
- Author : Pasha
Date : 08-11-2023 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
China Number 1 : ప్రపంచంలోనే ఎక్కువ దేశాలకు అప్పులు ఇచ్చిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ వంటి దాదాపు 165 దేశాలు చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (BRI) పేరుతో 2013 సంవత్సరం నుంచి ఎన్నో దేశాలకు చైనా విచ్చలవిడిగా లోన్లు ఇస్తోంది. ఆ నిధులను రోడ్లు, వంతెనలు, రైల్వే సదుపాయాలు, ఓడ రేవుల వంటి మౌలిక వసతుల డెవలప్మెంట్‌కే వాడాలని షరతు పెడుతోంది. ఈ అప్పులతో 165 దేశాలలో దాదాపు 21,000 మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
- చైనా ప్రతి సంవత్సరం ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్ల రుణాలను పేద, మధ్య ఆదాయ దేశాలకు అందిస్తోంది.
- ఈవిధంగా ప్రపంచ దేశాలకు అమెరికా ఏటా దాదాపు రూ.5 లక్షల కోట్ల లోన్లు ఇస్తోంది.
- ఈ లెక్కన ప్రపంచ దేశాలకు అప్పులు ఇవ్వడంలో అమెరికాను కూడా చైనా దాటేసింది.
- ఏదో ఒక రకంగా చైనా నుంచి అప్పులను తీసుకుంటున్న దేశాలు.. మళ్లీ వాటిని సకాలంలో తిరిగి కట్టలేక చైనా చేతిలో ఇరుక్కుపోతున్నాయి. అది పెట్టే షరతులకు తలొగ్గుతున్నాయి.
- ఆయా దేశాలు తాము తీసుకున్న లోన్లకు పూచీకత్తుగా.. చైనా సూచించిన విధంగా వాటి విదేశీ కరెన్సీ నిల్వలను ప్రత్యేక ఎస్క్రో అకౌంట్‌లో ఉంచుతున్నాయి.
- చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ ప్రాజెక్టుకు 165 దేశాల నుంచి వడ్డీతో సహా దాదాపు రూ.83 లక్షల కోట్ల అప్పు రావాల్సి ఉందని తాజా అధ్యయనాల్లో(China Number 1) తేలింది.