HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Earthquake Strikes Indonesias Banda Sea Region

Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. జనం వణుకు

Earthquake : ఇండోనేషియాలోని సౌలంకి సిటీలో ఇవాళ ఉదయం 10.23 గంటలకు భూకంపం సంభవించింది.

  • Author : Pasha Date : 08-11-2023 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake
Earthquake

Earthquake : ఇండోనేషియాలోని సౌలంకి సిటీలో ఇవాళ ఉదయం 10.23 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ఎఫెక్ట్ సౌలంకి సిటీ పరిసర ప్రాంతాల్లో కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మంది చనిపోయారు ? ఎంత మంది గాయపడ్డారు ? అనే వివరాలు తెలియరాలేదు.దేశంలోని బండా సముద్రంలో భూప్రకంపనలను గుర్తించామని ఇండోనేషియా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఇండోనేషియాలోని అంబాన్‌ ప్రాంతానికి ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల దూరాన 146 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఈనేపథ్యంలో సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇండోనేషియా సుప్రీంకోర్టులో.. 

ఇండోనేషియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ అన్వర్ ఉస్మాన్‌ను ఆ పదవి నుంచి తప్పిించారు. ఈమేరకు ఆ దేశానికి చెందిన న్యాయ నిపుణుల కమిటీ  నిర్ణయం తీసుకుంది. అన్వర్ ఉస్మాన్‌.. స్వయానా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు బావ అవుతారు. అధ్యక్షుడు జోకో విడోడో పెద్ద కుమారుడు గిబ్రాన్ రాకబుమింగ్ రాకా దేశ ఉపాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వినిపించిన రాజ్యాంగ  ధర్మాసనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ అన్వర్ ఉస్మాన్‌ సారథ్యం వహించారు. దీనిపై ఇండోనేషియా సుప్రీంకోర్టు న్యాయ విచారణ ప్యానెల్ సమీక్ష చేసి.. ఈ తీర్పును ఆయన బంధుప్రీతితో ఇచ్చారని తేల్చింది. దీంతో ఆయనను సీజేఐ పదవి నుంచి తప్పించింది. ఇకపై ఆయన సాధారణ జడ్జిగా కొనసాగొచ్చని తెెలిపింది. రిటైరయ్యే వరకు మళ్లీ చీఫ్ జస్టిస్ కాలేరని న్యాయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరిలో ఇండోనేషియా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోకు భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

Also Read: Soulmate Signs : మీ లవర్ ఆత్మీయుడా ? కాదా ? 6 సంకేతాలు

ఇండోనేషియాలోని బండా సముద్ర ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది: EMSC


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banda Sea Region
  • Deadly Earthquake
  • earthquake
  • Indonesia

Related News

Indonesia Helicopter Crash

Indonesia Helicopter Crash: ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి

ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య హెలికాప్టర్ శకలాలను అధికారులు గుర్తించారు. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం మెలావీలోని ఒక ప్లాంటేషన్ ఏరియా నుంచి టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాలకే ఎయిర్‌బస్ హెచ్130 హెలికా

  • earthquakes in california and nevada

    Earthquake: అమెరికాలో భూప్రకంపనలు

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd