HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Bomb Blast Kills 1 Injures 4 In Pakistan

Bomb Blast: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్

పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • Author : Gopi Date : 15-12-2022 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Explosion
Bomb blast

పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్‌ ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని మిరాన్‌షా పట్టణంలోని దత్తా ఖేల్ రోడ్డులో ఈ పేలుడు సంభవించింది. మిరాన్‌షా డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వలీ జమాన్ మాట్లాడుతూ.. ఒకరు మరణించారని, నలుగురు గాయపడ్డారని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రికతో చెప్పారు.

Also Read: Indian Girl: దుబాయ్‌లో భారతీయ బాలిక మృతి.. తొమ్మిదో అంతస్తు నుంచి జారి

నలుగురు గాయపడ్డారని, ఒక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు డాక్టర్ వలీ జమాన్ తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. అయితే ఈ మారుమూల సరిహద్దు ప్రాంతం గతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి బలమైన కోటగా ఉండేది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్సులలో తీవ్రవాద ఘటనలు పెరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blast in Pakistan
  • Bomb blast
  • Bomb blast in Pakistan
  • injures
  • pakistan
  • world news

Related News

US-Iran Talks

ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

  • US-Iran Talks

    సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • US-Iran Talks

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

Latest News

  • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • YCP MLC అనంతబాబు అరెస్ట్

  • RTC Driver Suicide : డ్రైవర్ కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యోగం..ప్రభుత్వం ప్రకటన

  • WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ

  • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd