Bomb Blast: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్
పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 08:55 AM, Thu - 15 December 22

పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని మిరాన్‌షా పట్టణంలోని దత్తా ఖేల్ రోడ్డులో ఈ పేలుడు సంభవించింది. మిరాన్‌షా డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వలీ జమాన్ మాట్లాడుతూ.. ఒకరు మరణించారని, నలుగురు గాయపడ్డారని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రికతో చెప్పారు.
Also Read: Indian Girl: దుబాయ్‌లో భారతీయ బాలిక మృతి.. తొమ్మిదో అంతస్తు నుంచి జారి
నలుగురు గాయపడ్డారని, ఒక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు డాక్టర్ వలీ జమాన్ తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. అయితే ఈ మారుమూల సరిహద్దు ప్రాంతం గతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి బలమైన కోటగా ఉండేది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్సులలో తీవ్రవాద ఘటనలు పెరిగాయి.