HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Big Shock For Donald Trump

Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

  • By Vamsi Chowdary Korata Published Date - 04:10 PM, Wed - 15 October 25
  • daily-hunt
Donald Trump Nobel Peace Pr
Donald Trump Nobel Peace Pr

అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపాను. ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది యుద్ధాలను ఆపేశాను.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను. నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇజ్రాయెల్‌తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నారు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. అక్టోబర్ 5 డెడ్ లైన్ పెట్టి మరీ.. అటు నెతన్యాహూ, ఇటు హమాస్‌ను తనదైన శైలిలో దారికి తెచ్చుకొని మరీ ఈ డీల్ కుదిర్చారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను అంటూ ట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని గొప్పలు చెప్పుకున్నారు. మావోడు పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ డబ్బా కొట్టింది.ఇంత చేసినా ట్రంప్ కోరిక నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమానం ఆయన్ను వరించలేదు. వేలాది ఏళ్లపాటు కాకపోయినా.. దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని.. మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌ విశ్వసించలేదు. దౌత్య మార్గంతోపాటు టారిఫ్‌‌లు విధిస్తామని బెదిరించి, సైన్యాన్ని రంగంలోకి దింపుతామని హెచ్చరించి యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు.

 

ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్థాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది. ఆ తర్వాత జులై నెలలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆ పని చేశారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం ట్రంప్ కృషి చేశారని పాక్ చెబితే.. పశ్చిమాసియాలో ట్రంప్ దౌత్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికిగానూ.. కాంబోడియా ప్రధాని హన్ మానెట్.. ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆగస్టులో నామినేట్ చేశారు. మీకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అనుకుంటున్నారా? అని వైట్ హౌస్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘అదంతా నాకు తెలీదు. కానీ మనం ఏడు యుద్ధాలు ఆపామని మార్కో రూబియో చెబుతున్నాడు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగింపుకొచ్చినట్టే. చరిత్రలో ఇన్ని యుద్ధాలు ఆపినవాళ్లు నాకు తెలిసి ఎవరూ లేరు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడానికి కారణమేంటో వాళ్లు గుర్తించాలి’ అంటూ ట్రంప్ మాట్లాడారు. తనకు నోబెల్ ఇవ్వాల్సిందే.. ఇవ్వకపోవడానికి కారణాలేవీ లేవు అనేది ట్రంప్ ధీమా.

 

మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ.. నాకు నోబెల్ పురస్కారం పట్ల ఇంట్రెస్ట్ లేదండీ.. నేను అటెన్షన్ కోరుకోవడం లేదు.. జస్ట్ ప్రజల ప్రాణాలను కాపాడాలనుకున్నా అని చెప్పుకొచ్చారు. ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లేందుకు ఇంతగా కృషి చేసినప్పటికీ.. ట్రంప్‌కు 2025లో నోబెల్ బహుమతి రాకపోవడానికి అతిపెద్ద కారణం.. నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల గడువు ఈ ఏడాది జనవరి 31న ముగియడమే. అంటే ట్రంప్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయ్యింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు. అంటే ట్రంప్‌ కోసం వేసిన నామినేషన్లను నోబెల్ కమిటీ.. 2026 కోసం పరిశీలిస్తుంది. అయితే, జనవరి 31 గడువు లోగా డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసిన వారు కూడా ఉన్నారు. ‘అబ్రహాం అకార్డ్స్’ కారణంగా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఒకరు ట్రంప్‌ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను నోబెల్ కమిటీ ఈ ఏడాది పరిశీలించింది.

 

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ట్రంప్ ఏడెనిమిది యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పుకుంటున్నా.. అందులో వాస్తవం లేదనేది నిపుణులు, విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ చెబుతున్న జాబితాలో ఉన్న వాటిలో ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఘర్షణలేం లేవు. ఇథియోపియా బ్లూ నైలు నదిపై నిర్మించిన డ్యామ్ విషయంలో ఈజిప్ట్‌తో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక సెర్బియా-కొసోవో మధ్య ఉద్రిక్తతలు సాయుధ సంఘర్షణ దాకా వెళ్లలేదు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణలను ట్రంప్ ఆపారు. భారత్ – పాక్ మధ్య సైనిక సంఘర్షణను తాను ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని ఖండించింది.

 

తాను అధికారంలోకి వస్తే గాజాలో ఇజ్రాయెల్ దాడులను, ఉక్రెయిన్-రష్యా వార్‌ను ఆపేస్తాని ట్రంప్ ఎన్నికల ముంగిట చెప్పారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం తాను అనుకున్నంత అంత త్వరగా ముగిసేలా కనిపించడం లేదని ఆ తర్వాత ట్రంపే స్వయంగా చెప్పారు. ఈ యుద్ధం ఆపడం కోసం ఆగస్టు నెలలో అలస్కా వేదికగా పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. అయితే నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఆగమేఘాల మీద ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చగలిగారు. ఇదొక్కటే ట్రంప్‌కు ఊరటనిచ్చే అంశం.

 

చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. శాంతి స్థాపన దిశగా ట్రంప్ చేసిన ఘనకార్యాలన్నీ ఈ ఏడాది నామినేషన్ల గడువు దాటాక చేసినవే. ఈ నామినేషన్లను నోబెల్ కమిటీ వచ్చే ఏడాదికి పరిగణనలోకి తీసుకుంటే.. మిస్టర్ పీస్ ప్రెసిడెంట్‌ గారికి వచ్చే ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా.. నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన అమెరికా అధ్యక్షులు వూడ్రో విల్సన్ టెడ్డీ రూజ్వెల్ట్ జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా సరసన నిలవడానికి ట్రంప్ వెయిట్ చేయాల్సిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • India vs Pak War
  • Nobel Peace Prize
  • Nobel Peace Prize 2025
  • world news

Related News

Joel Mokyr, Philippe Aghion

Nobel Prize in Economics 2025 : ఎకనామిక్ సైన్సెస్ లో ముగ్గురికి నోబెల్

Nobel Prize in Economics 2025 : 2025 సంవత్సరం ఆర్థిక శాస్త్రాల నోబెల్ పురస్కారాన్ని (Nobel Peace Prize) రాయల్ స్వీడిష్ అకాడమీ జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్‌(Joel Mokyr, Philippe Aghion, Peter Hot)లకు ప్రదానం చేసింది

  • Donald Trump

    Donald Trump: ప్రపంచంలోనే గొప్ప అధ్యక్షుడిని కావాలని అనుకుంటున్నా: ట్రంప్‌

  • America Tariff

    America Tariff: చైనాపై అమెరికా 100% సుంకం.. ట్రంప్ నిర్ణయం భార‌త్‌కు ప్ర‌యోజ‌నమేనా?

  • Nobel Peace Prize 2025

    Nobel Peace Prize 2025: నా నోబెల్ బ‌హుమతి ట్రంప్‌కు అంకితం: మారియా కోరినా

  • Trump Nobel Peace Prize

    Nobel Peace Prize : ట్రంప్ కు మద్దతిచ్చిన రష్యా

Latest News

  • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

  • Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • ‎Custard Apple: షుగర్ పేషంట్స్ సీతాఫలం తినవచ్చా.. తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

  • ‎Sitting on Floor: నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. డైనింగ్ టేబుల్ కి బైబై చెప్పేస్తారు!

  • Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా

Trending News

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd