India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం
ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.
- By Pasha Published Date - 04:18 PM, Mon - 23 December 24

India VS Bangladesh : మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గద్దె దిగినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతూపోతోంది. ఆ గ్యాప్‌ను మరింత పెంచే ఇంకో కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.
Also Read :INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్ వదులుకుంటే బెటర్ : మణిశంకర్ అయ్యర్
భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఉండే దౌత్యవేత్తలు ఈ మౌఖిక సందేశాన్ని భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ వివరాలను బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల తాత్కాలిక సలహాదారుడు తౌహీద్ హుస్సేన్ ధ్రువీకరించారు. ఇవాళ ఢాకాలో విలేకరులతో మాట్లాడుతూ ఈవిషయాన్ని ఆయన కన్ఫార్మ్ చేశారు. ఇదే అంశంపై బంగ్లాదేశ్ హోంశాఖ అడ్వైజర్ జహంగీర్ ఆలం ఇవాళ ఉదయం స్పందిస్తూ.. ‘‘మా కార్యాలయం నుంచి దేశ విదేశాంగ శాఖకు ఒక మౌఖిక సందేశం పంపాం. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు హసీనాను తిరిగి తీసుకురావాల్సిన అంశాన్ని అందులో ప్రస్తావించాం. ఈవిషయాన్ని భారత్‌కు తెలియజేయాలని నిర్ణయించాం’’ అని వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార వర్గాల నుంచి ఈ సందేశం భారత విదేశాంగ శాఖకు చేరుతుంది’’ అని ఆయన చెప్పారు.
Also Read :Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ
ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 77 ఏళ్ల షేక్ హసీనా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈవిధంగా రాజకీయ ఆశ్రయం పొందే వారికి సంబంధించిన అప్పగింతలపై ప్రస్తుతానికి భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి ఒప్పందమూ లేదు. పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమం జరగడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఉద్యమం వెనుక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్ ఉన్నారని షేక్ హసీనా చాలాసార్లు ఆరోపించారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర వల్లే తన ప్రభుత్వం కూలిందన్నారు.