Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ
ఆ నిత్య పెళ్లి కూతురి పేరు సీమా. నిక్కీ(Looteri Dulhan) అనే మరో పేరు కూడా ఆమెకు ఉంది.
- By Pasha Published Date - 02:28 PM, Mon - 23 December 24

Looteri Dulhan : ఆమె నిత్య పెళ్లి కూతురిగా మారింది. గత పదేళ్లలో ఎంతోమంది పురుషులను పెళ్లాడింది. అయితే మ్యారేజ్ చేసుకున్న ప్రతిసారీ.. కొన్ని నెలలకే భర్తలను వదిలేసింది. ఈక్రమంలో వారి నుంచి సెటిల్‌మెంట్ అమౌంటుగా భారీ మొత్తాలను వసూలు చేసింది. ఈవిధంగా గత పదేళ్లలో తనను పెళ్లాడిన వారి నుంచి రూ.1.25 కోట్లను వసూలు చేసింది. ఆ నిత్య పెళ్లి కూతురి బండారం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Smita Sabharwal : సిన్సీయర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ‘కాళేశ్వరం’ విషయంలో మీడియా ఓవర్ యాక్షన్
ఆ నిత్య పెళ్లి కూతురి పేరు సీమా. నిక్కీ(Looteri Dulhan) అనే మరో పేరు కూడా ఆమెకు ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర వాస్తవ్యురాలు. సీమాను హిందీ మీడియా ఇప్పుడు ‘లుటేరీ దుల్హన్’ అని పిలుస్తోంది. లుటేరీ అనే దోచుకునేది అని అర్థం. పెళ్లి చేసుకోవడం.. ఆ వెంటనే భర్త నుంచి డబ్బును దోచుకోవడాన్ని సీమా తన పనిగా పెట్టుకుంది. ఇలా చాలామంది భర్తలకు కుచ్చుటోపీ పెట్టింది. ‘వరుడు కావలెను’ అంటూ తన ఫొటోతో ఆమె ప్రఖ్యాత మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో యాడ్స్ ఇచ్చుకునేది. భార్యలు పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న బిజినెస్ పర్సన్లను పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పేది. ఈవిధంగా ధనవంతులను ముగ్గులోకి లాగి పెళ్లి చేసుకునేది. పెళ్లయ్యాక.. పోలీసు కేసులు పెడతానంటూ వాళ్లను బెదిరించి డబ్బులను గుంజేది.
Also Read :Naga Vamsi : దిల్ రాజు వచ్చాకే మీటింగ్ పెట్టుకొని డిసైడ్ అవుతాం.. సీఎం కామెంట్స్ పై నాగవంశీ..
సీమా.. వరుస పెళ్లిళ్ల సినిమా
- నిత్య పెళ్లి కూతురు సీమా తొలి మ్యారేజ్ 2013లో జరిగింది. ఆగ్రాకు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు గడిచాక.. అతడిని సీమా బెదిరించడం మొదలుపెట్టింది. నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి.. మొదటి భర్త కుటుంబంపై కేసు పెట్టింది. అనంతరం సెటిల్‌మెంట్ కింద ఆ కుటుంబం నుంచి రూ.75 లక్షలను వసూలు చేసి.. భర్తను వదిలి వెళ్లిపోయింది.
- 2017 సంవత్సరంలో గురుగ్రామ్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సీమా పెళ్లి చేసుకుంది. అనంతరం ఆ కుటుంబాన్ని కూడా బెదిరించి సెటిల్‌మెంట్ పేరుతో రూ.10 లక్షలను వసూలు చేసింది.
- 2023 సంవత్సరంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను సీమా పెళ్లి చేసుకుంది. అనంతరం ఆ వ్యాపారవేత్త ఇంట్లోని ఆభరణాలు, రూ.36 లక్షల నగదును తీసుకొని ఆమె బిచాణా ఎత్తేసింది. దీనిపై పోలీసులకు సదరు వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీమాను అరెస్టు చేశారు.
- ఈ మూడు పెళ్లిళ్ల ద్వారా రూ.1.25 కోట్లను సీమా రాబట్టింది.