Bangladesh Durga Puja: నమాజ్ టైంలో దుర్గాపూజలు చేయొద్దు.. హిందువులకు బంగ్లా సర్కారు ఆర్డర్
అజాన్‌కు ఐదు నిమిషాల ముందు నుంచి.. నమాజ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హిందూ ఆలయాల్లో పూజలు(Bangladesh Durga Puja) చేయరాదన్నారు.
- Author : Pasha
Date : 12-09-2024 - 12:59 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh Durga Puja: బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో దుర్గాపూజ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అక్కడి హిందూవర్గం ప్రజలకు బంగ్లాదేశ్ సర్కారు కీలక గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. అజాన్, నమాజ్ అవుతున్న టైంలో దుర్గా పూజకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించరాదని.. ప్రత్యేకించి ఆ టైంలో మ్యూజిక్‌ను, సౌండ్ సిస్టమ్‌లను ప్లే చేయరాదని స్పష్టం చేసింది. ఈమేరకు బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు. తాము చేసిన సూచనలకు దేశంలోని హిందూవర్గం ప్రతినిధులు మద్దతు ప్రకటించారని ఆయన తెలిపారు. అజాన్‌కు ఐదు నిమిషాల ముందు నుంచి.. నమాజ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హిందూ ఆలయాల్లో పూజలు(Bangladesh Durga Puja) చేయరాదన్నారు. ఆ టైంలో ఆలయాల వద్ద మ్యూజిక్, సౌండ్ సిస్టమ్‌లను ప్లే చేయరాదన్నారు.
Also Read :Another Pandemic : త్వరలో మహాయుద్ధం.. రాబోయే పాతికేళ్లలో మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ జోస్యం
‘‘బంగ్లాదేశ్‌లోని హిందువులు ఏటా దుర్గా పూజ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈసారి అదేవిధంగా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందుకోసం ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఈసారి మా దేశంలో దాదాపు 32,666 దుర్గాపూజ మండపాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 157 మండపాలు ఒక్క ఢాకా సౌత్ సిటీలోనే ఉంటాయి. 88 మండపాలు ఢాకా నార్త్ సిటీలో ఉంటాయి’’ అని బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి వివరించారు. గతేడాది తమ దేశంలో 33,431 దుర్గాపూజ మండపాలను ఏర్పాటు చేశారని.. ఆ సంఖ్యను మించి ఈసారి మండపాలు ఏర్పాటవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండపాలకు పూర్తి భద్రత కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు.
Also Read :Rs 2200 Crore Scam : రూ.2200 కోట్ల స్టాక్ మార్కెట్ స్కాం.. ప్రముఖ హీరోయిన్ దంపతులు అరెస్ట్
ఇటీవలే బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి మధ్యంతర ప్రభుత్వ సారథి, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో మత సామరస్యం, సోదరభావాన్ని పెంచేందుకు ప్రయారిటీ ఇస్తామన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఎవరైనా యత్నిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదన్నారు.