Another Pandemic : త్వరలో మహాయుద్ధం.. రాబోయే పాతికేళ్లలో మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ జోస్యం
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల విషయంలో ప్రపంచ అంచనాలను అమెరికా(Another Pandemic) అందుకోలేకపోయిందని బిల్‌గేట్స్ విమర్శించారు.
- By Pasha Published Date - 12:09 PM, Thu - 12 September 24

Another Pandemic : అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఏది మాట్లాడినా ఒక సంచలనమే. ఆయన తాజాగా సీఎన్‌బీసీ మీడియా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల కొన్ని దేశాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశం ఉందని బిల్‌గేట్స్ అంచనా వేశారు. ఒకవేళ ఏదోలా ఈ యుద్ధం ముప్పు నుంచి ప్రపంచం బయటపడినా.. 25 ఏళ్ల తర్వాత కరోనా తరహా మహమ్మారి చుట్టుముట్టే రిస్క్ ఉందని ఆయన జోస్యం చెప్పారు. 2019-2020 మధ్యకాలంలో ప్రపంచానికి దడ పుట్టించిన కరోనా మహమ్మారి గురించి బిల్‌గేట్స్ 2016 సంవత్సరంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన కరోనా తరహా మహమ్మారి ముప్పుపై ప్రపంచాన్ని అలర్ట్ చేస్తుండటం గమనార్హం. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల విషయంలో ప్రపంచ అంచనాలను అమెరికా(Another Pandemic) అందుకోలేకపోయిందని బిల్‌గేట్స్ విమర్శించారు.
Also Read :Rs 2200 Crore Scam : రూ.2200 కోట్ల స్టాక్ మార్కెట్ స్కాం.. ప్రముఖ హీరోయిన్ దంపతులు అరెస్ట్
‘‘కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు చాలానే నేర్చుకున్నాయి. అయినా అది చాలా తక్కువే. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ దేశాలు మహమ్మారులను ఎదుర్కొనేందుకు అవసరమైనంత సన్నద్ధతను సంతరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే దేశాలకు ఆ సామర్థ్యం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే సీఎన్ఎన్ మీడియా సంస్థతో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వల్ల వచ్చే ఐదేళ్లలో మానవాళి జీవితాల్లో పెనుమార్పు సంభవిస్తుందన్నారు. ఏఐ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని.. దానివల్ల కొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతాయని పేర్కొన్నారు.
Also Read :North Korea : మరోసారి మిస్సైళ్లు పరీక్షించిన కిమ్.. దక్షిణ కొరియా, జపాన్‌లలో హైఅలర్ట్
2022 సంవత్సరంలో బిల్‌గేట్స్‌కు చెందిన ‘హౌ టు ప్రివెంట్ ది నెక్ట్స్ ప్యాండెమిక్’ పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ప్రపంచదేశాలపై విమర్శలు గుప్పించారు. 2020 సంవత్సరంలో కరోనా చుట్టుముట్టినా ప్రపంచదేశాలు సన్నద్దంగా నిలువలేదన్నారు. క్వారంటైన్ నిబంధనల అమలులోనూ చాలా నిర్లక్ష్యం కనిపించిందని చెప్పారు. దీనివల్ల అప్పట్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని తెలిపారు. కనీసం రానున్న కాలంలోనే వ్యాక్సిన్ పరిశోధనలు, తయారీపై ప్రపంచ దేశాలు సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని సూచించారు.