Rs 2200 Crore Scam : రూ.2200 కోట్ల స్టాక్ మార్కెట్ స్కాం.. ప్రముఖ హీరోయిన్ దంపతులు అరెస్ట్
ప్రజల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బును తొలుత ఆ నకిలీ కంపెనీల్లోకి.. వాటి నుంచి నేరుగా అసోం మూవీ ఇండస్ట్రీలోకి(Rs 2200 Crore Scam) పంప్ చేసేవాడు.
- By Pasha Published Date - 11:30 AM, Thu - 12 September 24

Rs 2200 Crore Scam : అసోంలో జరిగిన రూ.2,200 కోట్ల స్టాక్ ట్రేడింగ్ స్కాం వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరోయిన్ సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
Also Read :North Korea : మరోసారి మిస్సైళ్లు పరీక్షించిన కిమ్.. దక్షిణ కొరియా, జపాన్‌లలో హైఅలర్ట్
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. విశాల్ ఫుకాన్ అనే వ్యక్తి కొందరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. తాము స్టాక్ మార్కెట్‌లో భారీగా సంపాదించబోతున్నామని నమ్మించాడు. డబ్బులను తమకు పెట్టుబడిగా అందించే వారికి డబుల్ రాబడులు అందిస్తామని మాట ఇచ్చాడు. సగటున 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడిని అందిస్తానని విశాల్ ఫుకాన్ ముమ్మరంగా ప్రచారం చేశాడు. తన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చే వారి నుంచి నిధుల సమీకరణ కోసం నాలుగు నకిలీ కంపెనీలను ఏర్పాటు చేయించాడు. ప్రజల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బును తొలుత ఆ నకిలీ కంపెనీల్లోకి.. వాటి నుంచి నేరుగా అసోం మూవీ ఇండస్ట్రీలోకి(Rs 2200 Crore Scam) పంప్ చేసేవాడు.
Also Read :Hamas Vs Israel : కాల్పుల విరమణకు సిద్ధమన్న హమాస్.. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్
ఈ డబ్బును సినీరంగంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో విశాల్ ఫుకాన్ విలాసవంతమైన లైఫ్ గడిపేవాడు. స్థిరాస్తులు, చరాస్తులను కొనేవాడు. ఇటీవలే విశాల్ ఫుకాన్‌ను అరెస్టు చేసి విచారించిన అసోం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కీలక వివరాలను గుర్తించారు. ఈ కుంభకోణంలో హీరోయిన్ సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ఉన్నారని నిర్ధారించారు. వెంటనే వారిని విచారణకు పిలిచారు. అయితే సుమి బోరా దంపతులు అందుకు నో చెప్పారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.బుధవారం రోజు హీరోయిన్ సుమి బోరా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను విచారణకు సహకరించడానికి సిద్ధమని ప్రకటించారు.