Arun Subramanian: న్యూయార్క్ జిల్లా జడ్జిగా అరుణ్ సుబ్రమణియన్.. ఎవరీ సుబ్రమణియన్..?
భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ (Arun Subramanian) సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఈ బెంచ్‌లో సేవలందిస్తున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తి కూడా ఆయనే.
- By Gopichand Published Date - 11:54 AM, Wed - 8 March 23

భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ (Arun Subramanian) సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఈ బెంచ్‌లో సేవలందిస్తున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తి కూడా ఆయనే. సెనేట్ జ్యుడీషియరీ కమిటీ దీనిని ధృవీకరించింది. గతేడాది సెప్టెంబరులో అమెరికాలోని బైడెన్ పరిపాలన న్యూయార్క్ జిల్లా జడ్జిగా భారతీయ-అమెరికన్ న్యాయవాది అరుణ్ సుబ్రమణ్యాన్ని నామినేట్ చేసింది.
సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (SDNY)కి న్యాయమూర్తిగా సుబ్రమణియన్ నియామకాన్ని US సెనేట్ మంగళవారం సాయంత్రం 58-37 ఓట్ల తేడాతో ఆయన నామినేషన్ కన్ఫర్మ్ అయ్యింది. SDNI న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్‌ను మేము ధృవీకరించామని సెనేట్ లీడర్ సెనేట్ చక్ షుమెర్ తెలిపారు. అతను విదేశీ భారతీయుడి కుమారుడు. ఈ జిల్లా కోర్టుకు న్యాయమూర్తి అయిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచారు.
సుబ్రమణ్యం ఎవరు..?
సుబ్రమణియన్ 1979లో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 1970ల ప్రారంభంలో భారతదేశం నుండి USకి వలస వచ్చారు. అతని తండ్రి అనేక కంపెనీలలో ‘కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్’గా పనిచేశారు. అతని తల్లి కూడా పనిచేశారు. అతను 2001లో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.
Also Read: TeamIndia Celebrates Holi: బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ వేడుకలు.. ఫోటోలు వైరల్..!
సుబ్రమణియన్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని న్యాయ సంస్థ సుస్మాన్ గాడ్‌ఫ్రే LLPలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ అతను 2007 నుండి పనిచేస్తున్నాడు. అతను 2006 నుండి 2007 వరకు US సుప్రీం కోర్ట్‌లో జస్టిస్ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్‌కు క్లర్క్‌గా పనిచేశాడు. దీనికి ముందు, అతను 2005 నుండి 2006 వరకు న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన జస్టిస్ గెరార్డ్ ఇ. లించ్ కోసం పనిచేశాడు. 2004 నుండి 2005 వరకు అతను కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జి డెన్నిస్ జాకబ్స్‌కు లా క్లర్క్ గా పని చేశారు.
సుబ్రమణియన్ 2004లో కొలంబియా లా స్కూల్ నుండి JDని, 2001లో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి BA పట్టా పొందారు. అంతకుముందు, నేషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ సుబ్రమణియన్ నామినేషన్‌పై అభినందనలు తెలిపింది. అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎబి క్రూజ్ మాట్లాడుతూ.. సుబ్రమణియన్ నిస్వార్థ సేవ బలమైన రికార్డుతో అనుభవజ్ఞుడైన న్యాయవాది అని అన్నారు.

Tags
- America District Judge
- Arun Subramanian
- Indo American
- joe biden
- New York
- US President Joe Biden
- world news

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.