Anita Anand : కెనడా ప్రధాని రేసులో మన అనిత.. నేపథ్యం ఇదీ
అనిత తల్లి సరోజ్ దౌలత్‌రామ్(Anita Anand) పంజాబ్ వాస్తవ్యురాలు. సరోజ్ ఒక అనస్తీషియాలజిస్ట్.
- By Pasha Published Date - 09:03 AM, Thu - 9 January 25

Anita Anand : కెనడా రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. దేశ ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాక.. ఆ పదవిని తదుపరిగా చేపట్టబోయేది ఎవరు ? అనే అంశంపై చర్చ మొదలైంది. ప్రధానమంత్రి పదవి రేసులో ప్రధానంగా ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ జాబితాలో ఒక భారత సంతతి మహిళ పేరు కూడా ఉంది. ఆమె పేరు అనితా ఇందిరా ఆనంద్.
Also Read :Private Market Yards : ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులు.. తెలంగాణలో అధ్యయనం
అనితా ఇందిరా ఆనంద్ గురించి..
- అనిత కెనడాలోని నోవాస్కోటియాలో ఉన్న కెంట్‌విల్లేలో జన్మించారు.
- అనిత తల్లి సరోజ్ దౌలత్‌రామ్(Anita Anand) పంజాబ్ వాస్తవ్యురాలు. సరోజ్ ఒక అనస్తీషియాలజిస్ట్.
- అనిత తండ్రి సుందరం వివేక్ స్వస్థలం తమిళనాడు. ఆయన ఒక జనరల్ సర్జన్.
- సరోజ్ దౌలత్‌రామ్, సుందరం వివేక్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పెద్ద కూతురే అనితా ఇందిరా ఆనంద్.
- అనిత తల్లిదండ్రులు కొన్నాళ్ల పాటు నైజీరియాలో నివసించారు. అయితే 1960వ దశకం ప్రారంభంలో కెనడాలోని కెంట్‌విల్లేకు వలస వచ్చారు.
- ఆమె పొలిటికల్ స్టడీస్‌లో డిగ్రీ కోర్సు చేశారు. ఆక్స్‌ఫర్డ్, డల్హౌసీ యూనివర్సిటీల్లో లా కోర్సులు చేశారు.
- ఆమె కెరీర్ ప్రస్థానం కార్పొరేట్ లాయర్‌గా మొదలైంది.
- కొన్ని లా యూనివర్సిటీల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్ లెక్చరర్‌గా, బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు.
- లిబరల్ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్ ఆఫ్ కామన్స్ ఓక్‌విల్లే నుంచి మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు.
- 2021 వరకూ పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. కెనడాలో ఈ పదవిని పొందిన తొలి హిందూ మంత్రి ఆమె ఒక్కరే.
- గత మంత్రి సజ్జన్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆర్మీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అనితను రక్షణ మంత్రిగా ఎంపికచేశారు. దీంతో సాయుధదళాల్లో లైంగిక వేధింపుల్ని అరికట్టే కొత్త సంస్కరణలను తీసుకొచ్చారు.
- ప్రస్తుతం కెనడా దేశ రవాణా, అంతర్గత వాణిజ్యమంత్రిగా అనిత పనిచేస్తున్నారు.