PAC Meeting : సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్
PAC Meeting : ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు మంత్రులు సరైన స్పందన ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు
- By Sudheer Published Date - 08:30 AM, Thu - 9 January 25

తెలంగాణలో అధికార పార్టీ (Congress) పట్ల ప్రతిపక్షాల విమర్శలు ముమ్మరంగా సాగుతుండగా, మంత్రుల (Ministers) స్పందన తక్కువగా ఉండడంపై పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. AICC ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ PAC సమావేశంలో (PAC Meeting) మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు మంత్రులు సరైన స్పందన ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సమావేశంలో కే.సి. వేణుగోపాల్ మంత్రులను ప్రశ్నిస్తూ, సీఎం మీద విమర్శలు వస్తే ఆయనే కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని నిలదీశారని సమాచారం. ప్రతిపక్షాలు పెట్టే విమర్శలకు మీరెందుకు సమర్థవంతంగా స్పందించడంలేదని ప్రశ్నించారు. ఓ మంత్రి తాను స్పందిస్తున్నానని చెప్పగా, ఏ మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారో తనకు తెలుసని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Tirupati Stampede Incident : తిరుపతికి చంద్రబాబు
కొందరు మంత్రులు పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కూడా వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తమ ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల ప్రజల్లో తప్పు సందేశం వెళ్తోందని అభిప్రాయపడ్డారు. మంత్రులు తమ బాధ్యతలను సరిగా నిర్వహించి, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. సీఎం నాయకత్వాన్ని ప్రజల్లో బలపరచడం మంత్రుల బాధ్యత అని వేణుగోపాల్ తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలపై వెంటనే స్పందించడంతో పాటు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా ముందుకు రావాలని సూచించారు. ప్రతి అంశంపై మీడియా ముందుగానే స్పందించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
BIG BREAKING – Tirupati Stampede : తొక్కిసలాట ఘటనలో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ సమావేశం తరువాత మంత్రులు మరింత సజాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నారు. పార్టీ లైన్‌ను అనుసరించి, సీఎం నాయకత్వాన్ని ప్రజలకు చేరువ చేయడం, ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా ఎదుర్కోవడం ఇప్పుడు మంత్రుల ప్రధాన బాధ్యతగా మారింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేణుగోపాల్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.