American Airlines: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం.. నదిలో కుప్పకూలిన విమానం!
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 బుధవారం వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ల్యాండింగ్ సమయంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.
- By Gopichand Published Date - 09:12 AM, Thu - 30 January 25

American Airlines: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో (American Airlines) ప్రయాణీకుల విమానం, హెలికాప్టర్ ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత ప్రయాణీకుల విమానం పొటోమాక్ నదిలో పడిపోయింది. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాల్లో హెలికాప్టర్‌ను ఢీ కొట్టి విమానం కుప్పకూలింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రీగన్ విమానాశ్రయం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో కూడిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ పోలీస్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కన్సాస్ లోని విచిత నుంచి వాషింగ్టన్ ప్రయాణిస్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ 5342 విమానంగా అధికారులు గుర్తించారు. వివిధ అమెరికన్ రక్షణ బృందాలు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్‌ను చేపట్టాయి.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 బుధవారం వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ల్యాండింగ్ సమయంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత విమానాశ్రయం నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేశారు. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.
Also Read: Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
A helicopter has reportedly collided with an American Airlines flight heading into Reagan National in DC from Wichita.
A massive search and rescue operation is currently underway.
The plane reportedly had 60 passengers and 4 personnel on board. 😔
— The Persian Jewess (@persianjewess) January 30, 2025
విమాన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. వాషింగ్టన్ DC అగ్నిమాపక విభాగం విడిగా ధృవీకరించింది. అదే సమయంలో పరిస్థితిపై ట్రంప్‌కు సమాచారం అందించినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. ఈ సమయంలో జెట్ విమానం విచిత కాన్సాస్ నుండి బయలుదేరింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వే వద్దకు రాగానే ఆర్మీ బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ ప్రకారం.. క్రాష్ అయిన జెట్‌లో 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. అయితే ఈ సంఘటనలో చాలా మంది మరణించారని అమెరికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ చెప్పారు. “బోర్డులో ఎంత మంది మరణించారో మాకు ఇంకా తెలియనప్పటికీ కొంతమంది మరణించినట్లు మాకు తెలుస్తోంది” అని ఆయన ట్వీట్ చేశారు.