Philadelphia bar shooting: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన.. 12 మందికి గాయాలు.!
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన ఘటన చోటుచేసుకుంది.
- By Gopichand Published Date - 12:17 PM, Sun - 6 November 22

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన ఘటన చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలోని కెన్సింగ్టన్ సెక్షన్‌లోని బార్ వెలుపల శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితుల గురించి సమాచారం లేదు. కాల్పులకు దారితీసిన కారణం కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అంతకుముందు.. నార్త్ కరోలినాలోని ర్యాలీలో జరిగిన తుపాకీ కాల్పులలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటనలో పలువురి హస్తం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పలు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే.. నల్లటి కారులో వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. గత కొంతకాలంగా యూఎస్ఏలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.