10,000 Terrorists: సరిహద్దుల్లో 10వేల మంది ఉగ్రవాదులు
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో 10,000 మంది ఉగ్రవాదులు (10,000 Terrorists) దాగి ఉన్నారని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు దాదాపు 7,000 నుంచి 10,000 మంది వరకు దాగి ఉన్నారు.
- By Gopichand Published Date - 01:45 PM, Fri - 30 December 22

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో 10,000 మంది ఉగ్రవాదులు (10,000 Terrorists) దాగి ఉన్నారని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు దాదాపు 7,000 నుంచి 10,000 మంది వరకు దాగి ఉన్నారు. వీరితో పాటు మరో 25 వేల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. నవంబర్ నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద నిరోధక దళం వైఫల్యమే ఇందుకు కారణం’ అని రాణా సనావుల్లా ఆరోపించారు. ఆ రాష్ట్రంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధికారంలో ఉండటం గమనార్హం.
Also Reads: 4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
పాకిస్థాన్-ఆఫ్ఘన్ దేశాలే ఉగ్రవాదులకు పుట్టినిల్లు అని ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వయంగా నిధులు సమకూరుస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామమని ప్రపంచ దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. దీంతో తాజాగా రాణా సనావుల్లా చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.