Mexico Bar Firing: మెక్సికోలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
మెక్సికో (Mexico)లోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలో ఓ బార్ లో కాల్పులు (Firing) జరిగాయి. ఈ దాడిలో పది మంది మరణించారు. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా గాయపడ్డారు. దాడిని ధృవీకరిస్తూ స్థానిక అధికారులు ఈ సమాచారాన్ని అందించారు.
- By Gopichand Published Date - 07:36 AM, Tue - 14 March 23

మెక్సికో (Mexico)లోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలో ఓ బార్ లో కాల్పులు (Firing) జరిగాయి. ఈ దాడిలో పది మంది మరణించారు. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా గాయపడ్డారు. దాడిని ధృవీకరిస్తూ స్థానిక అధికారులు ఈ సమాచారాన్ని అందించారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ ఆఫ్ గ్వానాజువాటోలో ఈ దాడి జరిగింది. ఎల్ ఎస్టాడియో బార్‌లో ఈ దాడి జరిగింది. దాడి చేసేందుకు గుంపులుగా వచ్చిన కొందరు సాయుధులు దాడికి పాల్పడ్డారు.
ఎల్ ఎస్టాడియో బార్ సెలయా, క్వెరెటారో నగరాలను కలిపే రహదారిపై ఉంది. ఇక్కడ కస్టమర్లు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో ఈ దాడిలో మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. మెక్సికో సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటో అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతం. ఇది మెక్సికోలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ఈ రోజుల్లో దేశంలో అత్యంత రక్తపాత రాష్ట్రంగా మారింది.
Also Read: 22 Terrorists: 22 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?
సెంట్రల్ స్టేట్ ఆఫ్ గ్వానాజువాటో, మెక్సికోలో శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూవా జనరేషన్ అనే రెండు కార్టెల్‌లు ఉన్నాయి. . అయితే యుద్ధానికి ఈ ప్రాంతం వేధికగా మారింది. ఇక్కడ ఉండే వారంతా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఎక్కువగా డ్రగ్ స్మగ్లింగ్, ఇంధన దొంగతనాలకు ప్రసిద్ధి చెందారు. తాజాగా జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కూడా ఓ చర్చిపై దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది తీవ్రంగా గాయపడగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రోస్‌బోర్‌స్టెల్ జిల్లాలోని డెల్‌బోజ్ స్ట్రీట్‌లోని చర్చిపై దుండగులు కాల్పులు జరిపారు.

Related News

Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు..