షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్యక్తి
- Author : Vamsi Chowdary Korata
Date : 04-03-2026 - 3:48 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఒక వ్యక్తి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అపార్ట్మెంట్లో అతను వినియోగిస్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా మొరాయించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భయానక దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
అసలేం జరిగిందంటే..!
వల్సాడ్‌లోని సర్దార్ హైట్స్ సొసైటీలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. తొమ్మిదో అంతస్తులో నివసించే ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. బటన్ నొక్కిన తర్వాత సుమారు 35 సెకన్ల పాటు లిఫ్ట్ తలుపులకు ఆనుకుని నిల్చున్నాడు.
గ్రౌండ్ ఫ్లోర్ రాగానే తలుపులు తెరుచుకోవడంతో బయటకు అడుగు వేశాడు. అయితే, అతను పూర్తిగా బయటకు రాకముందే లిఫ్ట్ వేగంగా పైకి కదలడం ప్రారంభించింది. దీంతో అతను లిఫ్ట్‌కు, ఫ్లోర్‌కు మధ్య ఇరుక్కుపోయే ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అతని తల లిఫ్ట్ డోర్‌కు బలంగా తగలడంతో స్వల్ప గాయమైంది. ఈ ఘటన అనంతరం అపార్ట్మెంట్ వాసులు వెంటనే ఆ లిఫ్ట్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
दिल देहलदेने वाला वलसाड का यह वीडियो लिफ्ट के रखरखाव की कमी को उजागर करता है। दरअसल, गुजरात की कई पुरानी सोसायटीज में खस्ता हाल में ही लिफ्ट चल रही है। जो कभी भी मौत को बुलावा दे सकती है। @sanghaviharsh pic.twitter.com/T5vK4tBuhq
— Dixit Soni (@DixitGujarat) March 3, 2026